తెలుగు సినిమా రేంజ్‌ పెరిగిందని చెప్పుకుంటున్నాం. వెయ్యి కోట్ల సినిమాగా వర్ధిల్లుతున్నదని గర్వపడుతున్నాం.

తెలుగు సినిమా రేంజ్‌ పెరిగిందని చెప్పుకుంటున్నాం. వెయ్యి కోట్ల సినిమాగా వర్ధిల్లుతున్నదని గర్వపడుతున్నాం. తెలుగు సినిమా బడ్జెట్‌ మినిమమ్‌ 500 కోట్ల రూపాయలు ఉంటుందని కాలరేగరేస్తున్నాం. ఇందులో సగానికంటే ఎక్కువ రెమ్మునరేషన్‌లకే పోతున్నదన్నది నమ్మలేని నిజం. మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్న పుష్ప 2 సినిమా విషయానికే వద్దాం.. పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌ నేషనల్ స్టార్‌ అయ్యాడు. జాతీయ అవార్డు కూడా గెల్చుకున్నాడు. ఆయన క్రేజ్‌ పెరిగింది. దీంతో పుష్ప 2లో రెమ్యునరేషన్‌కు బదులుగా లాభాలలో షేర్‌ తీసుకోవాలని డిసైడయ్యాడు. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ వెయ్యి కోట్ల రూపాయలు దాటేసింది. ఈ లెక్కన అల్లు అర్జున్‌ రెమ్యునరేషన్‌(allu arjun remuneration) ఈజీగా 270 కోట్ల నుంచి 280 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. దర్శకుడు సుకుమార్‌ తక్కువేమీ తీసుకోలేదు. పుష్ప పార్ట్‌ వన్‌లో కేవలం దర్శకుడిగానే పని చేసిన సుకుమార్‌ పుష్ప 2 సినిమాకు మాత్రం సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థతో నిర్మాణంలో భాగమయ్యాడు. సుకుమార్‌కు ఎంత లేదన్నా వంద కోట్ల రూపాయలకుపైగా అందింది. హీరోయిన్‌ రష్మిక మందన్నాకు పది కోట్ల రూపాయలు ఇచ్చారు. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్‌ ఎనిమిది కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నాడు. ఐటమ్‌సాంగ్‌లో మెరిసిన శ్రీలీల(Sreeleela)కు రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు. సినిమాకు సంగీతం ప్రాణం కాబట్టి దేవిశ్రీ ప్రసాద్‌(Devi Sri Prasad)కు అయిదు కోట్ల రూపాయలకు పైగానే ఇచ్చారు. సినిమాలో కీలక పాత్రలలో నటించిన జగపతిబాబు, రావు రమేశ్‌, సునీల్‌, అనసూయ, అజయ్‌లకు కూడా భారీగానే ముట్టచెప్పారు నిర్మాతలు.

ehatv

ehatv

Next Story