వివాహానికి(Marriage) సంబంధించి ఒక్కో దేశంలో ఒక్కో ఆచారం ఉంటుంది.

వివాహానికి(Marriage) సంబంధించి ఒక్కో దేశంలో ఒక్కో ఆచారం ఉంటుంది. ఒక్కో దేశంలోనే కాదు.. ఒక దేశంలోనే ప్రాంతాలు, మతాలబట్టి రకరకాల ఆచార(Traditions) వ్యవహారాలుంటాయి. భారతదేశంలో కూడా విభిన్న వివాహ సంప్రదాయాలు ఉన్నాయి. అయితే కొన్ని ఆచారాలు చాలా అసాధారణమైనవి, అవి నమ్మడం కష్టం. ఇప్పుడు ఒక విచిత్రమైన వివాహ సంప్రదాయం గురించి చెప్తే ఆశ్చర్యపోతారు.

ఇండోనేషియాలో(Indonesia) వివాహం తర్వాత ఒక వింత ఆచారం పాటిస్తారు. కొత్తగా పెళ్లయిన జంట పెళ్లి అయిన వెంటనే టాయిలెట్‌కి(Toilet) వెళ్లడం అక్కడ నిషేధం. ఈ సంప్రదాయాన్ని ఇండోనేషియాలోని టిడాంగ్ కమ్యూనిటీ(dating community) అనుసరిస్తుంది. ఇక్కడ ఇది చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ ఆచారం ప్రకారం, నూతన వధూవరులు మూడు రోజులు బాత్రూమ్ ఉపయోగించకూడదు. అలా చేయడం అశుభం, అపచారమని నమ్ముతారు. వివాహం ఒక పవిత్రమైన ప్రక్రియ అని ఎవరైనా మరుగుదొడ్డికి వెళితే అది వారి స్వచ్ఛతను కలుషితం చేస్తుందని నమ్ముతారు. వధువు, వరుడు ఇద్దరూ అపవిత్రంగా పరిగణించబడతారు. ఇండోనేషియాలో ఈ పద్ధతిని అనుసరించడానికి మరొక కారణం చెడు దృష్టిన నూతన వధూవరులను పడకుండా ఉండడం కోసంమని చెప్తారు. మరుగుదొడ్లను చాలా మంది ప్రజలు ఉపయోగిస్తారని ఇది శరీరంలోని మలినాలను తొలగిస్తుందని నమ్ముతారు. టాయిలెట్లు ప్రతికూల శక్తిని కలిగి ఉన్నాయని భావిస్తారు. పెళ్లి అయిన వెంటనే జంట టాయిలెట్‌ని ఉపయోగిస్తే ఆ ప్రతికూలత వీరి వివాహ బంధంలో ఏర్పడుతందని నమ్ముతారు. పెళ్లయిన వెంటనే టాయిలెట్‌కి వెళ్లడం వల్ల దంపతుల బంధం దెబ్బతింటుందని, కొన్నిసార్లు విడిపోవడానికి కూడా దారితీస్తుందనే నమ్మకం కూడా ఈ సమాజంలో ఉంది. అందుకని వధువరులకు ఈ మూడు రోజులు వధువరులకు వీలైనంత తక్కువ ఆహారం అందిస్తారు. ఇండినేషియాలోని టిడాంగ్‌ కమ్యూనిటీ ఆ ఆచారాన్ని తరతరాలుగా కచ్చితంగా పాటిస్తారు.

Eha Tv

Eha Tv

Next Story