ఇవాళ ప్రపంచ గులాబీ దినోత్సవం(World Rose Day).

ఇవాళ ప్రపంచ గులాబీ దినోత్సవం(World Rose Day). ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 22వ తేదీన గులాబీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. గులాబీ పువ్వంటే(Rose) అందరికి ప్రేమను వ్యక్తంచేసే అద్భుతమైన అందమైన పువ్వుగా మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ గులాబీ అంటే ప్రేమను తెలియజేసే నిర్వచనం మాత్రమేకాదు, గులాబీ రంగు కేన్సర్‌(Cancer) వ్యాధికి గుర్తు కూడా. ఆ భయంకరమైన వ్యాధి ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటోంది. ప్రతి ఏడాది వేలాదిమంది కేన్సర్‌కు బలైపోతున్నారు. కేన్సర్‌ అనగానే జీవితం మీద ఆశ వదులుసుకుంటారు చాలా మంది. కానీ కేన్సర్‌ నుంచి కూడా బయటపడవచ్చు. అందుకే ప్రపంచ దేశాలన్ని ముందుకు వచ్చి కేన్సర్‌ను జయించే విధంగా ప్రజలకు మనోధైర్యం నింపడటంతో పాటు చైత్యవంతులను చేసే విధంగా అడుగులు వేయాలని సంకల్పించాయి. దానిలో భాగంగానే ఐక్యరాజ్యసమితి వరల్డ్‌ రోజ్‌ డే అనే ప్రతిపాదన తీసుకువచ్చింది. దీంతో ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 22వ తేదీన ప్రపంచ గులాబీ దినోత్సవం (వరల్డ్‌ రోజ్‌ డే)ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు.

Eha Tv

Eha Tv

Next Story