ప్రముఖ అమెరికా(America) కంపెనీ టెస్లా(Tesla) ఓ ఉద్యోగ ప్రకటన ఇచ్చింది.

ప్రముఖ అమెరికా(America) కంపెనీ టెస్లా(Tesla) ఓ ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. పెద్దగా కష్టపక్కర్లేదు కానీ ఓ ఏడు గంటల పాటు నడిస్తే(Walking) చాలు.. నడకంటే ఇష్టపడేవాళ్లు ఎంచక్కా ఉద్యోగంలో చేరిపోవచ్చు. జీతమంటారా? గంటకు 48 అమెరికన్‌ డాలర్లు ఇస్తారు. అంటే ఇంచుమించు నాలుగు వేల రూపాయలన్నమాట! ఆ లెక్కన ఏడు గంటలు పని చేస్తే రోజుకు 28 వేల రూపాయలు వస్తాయి. బ్రహ్మండంగా ఉంది కదూ!

చేయాల్సిన పనేమిటంటే టెస్లా కంపెనీ తన హ్యూమనాయిడ్ రోబోట్(Humanoid Robort) ఆప్టిమస్‌ను డెవలప్‌ చేస్తోంది. ఇందులో భాగమైన మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీలో ఉపయోగించి రోబోట్‌లకు ట్రైనింగ్‌ ఇవ్వాలనుకుంటోంది కంపెనీ. ఇందుకోసమే ఉద్యోగ ప్రకటన చేసింది. ఈ రంగంలో ఎక్స్‌పీరియన్స్‌ ఉన్నవారికి ఇంతకు మించిన ఉద్యోగం మరోటి ఉండదు.

ఈ జాబ్‌లో చేరాలనుకునేవారు మోషన్‌-క్యాప్చర్‌ సూట్‌, వర్చువల్‌ రియాలిటీ హెడ్‌సెట్‌లు ధరించాలి. రోజూ ఏడు గంటల పాటు నిర్ధిష్ట మార్గాలలో నడవాలి. డేటా సేకరణ, విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగంలో చేరాలనుకునేవారి ఎత్తు 5 అడుగుల ఏడు అంగుళాల నుంచి 5 అడుగుల 11 అంగుళాల మధ్య ఉండాలి. ఓ 13 పౌండ్ల బరువునెత్తగలిగే సామర్థ్యం ఉండాలి. ఉద్యోగులు మూడు షిఫ్టులలో పని చేయాల్సి ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ఓ షిప్ట్‌. సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు రెండో షిఫ్ట్‌, అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 8.30 గంటల వరకు మూడో షిప్ట్ ఉంటుంది.

Eha Tv

Eha Tv

Next Story