టెలిగ్రాం సీఈవో(Telegram CEO) దురోవ్‌ పావెల్‌(Durov Pavel) సంచలన ప్రకటన చేశారు.

టెలిగ్రాం సీఈవో(Telegram CEO) దురోవ్‌ పావెల్‌(Durov Pavel) సంచలన ప్రకటన చేశారు. తన వీర్యకణాలు(Sperms) తీసుకున్న మహిళలకు తాను భాగస్వామిగా ఉన్న ఆల్ట్రావిటా ఫెర్టిలిటీ క్లినిక్‌లో(Altravita Ferlity Clinic) ఉచితంగా ఐవీఎఫ్‌ చికిత్స(IVF Treatment) అందిస్తానని ప్రకటన చేశారు. దురోవ్ తన స్పెర్మ్‌ని ఉపయోగించడానికి ఇష్టపడే మహిళలకు ఉచిత ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) చికిత్సలను అందిస్తున్నాడు. అతని ఆఫర్ సంతానం లేని జంటలకు ఉపయోగపడేందుకే ఈ ప్రయత్నమని దురోవ్‌ ప్రకటించారు. ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందించడానికి తాము సంతోషిస్తున్నామని, తమ క్లినిక్‌లో మాత్రమే పావెల్ డ్యూరోవ్ స్పెర్మ్‌ని ఉపయోగించి ఉచితంగా IVF చేయించుకోవాలన్నారు. ఈ క్లినిక్‌ అత్యుత్తమ సంరక్షణ చర్యలు చేపడుతుందని, ఫర్టిలిటీ నిపుణులతో కలిసి పని చేస్తుందని.. అధునాతన సాంకేతికతతో పనిచేస్తామని ఆట్రావిటా ఫెర్టిలిటీ ప్రకటించింది. దురోవ్‌ వీర్యకణాలు కావాలనుకున్న మహిళలు క్లీనిక్‌లో సంప్రదించాలని తెలిపింది. మహిళకు 37 ఏళ్ల కంటే ఎక్కువ ఉండకూడదని షరతు విధించింది. ఆసక్తి కలిగిన మహిళల వస్తే ఐవీఎఫ్‌ నిపుణులు చికిత్స విధానం గురించి వివరిస్తారని అవసరమైన పరీక్షలు చేస్తారని తెలిపారు.

దీనిపై టెలిగ్రాం సీఈవో స్పందిస్తూ తాను ఇప్పటికే 100 మందికి స్మెర్మ్ దానం చేశానని.. తన జీన్స్ కలిగిన పిల్లలు ప్రపంచంలో 100 మంది ఉన్నారని ప్రకటించారు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందో కూడా దురోవ్‌ వివరించారు. 15 సంవత్సరాల క్రితం స్పెర్మ్ డొనేషన్ కోసం ఒక స్నేహితుడు తనను ఎలా సంప్రదించాడని అన్నారు. తన స్నేహితుడు, అతని భార్య సంతానోత్పత్తి సమస్య కారణంగా పిల్లలు పుట్టలేకపోయారని వారికి బిడ్డ పుట్టేందుకు తన స్మెర్మ్‌ దానం చేయాలని కోరారన్నారు. తొలుత తాను నవ్వానని.. తర్వాత తన స్నేహితుడి పరిస్థితిని అర్థం చేసుకొని స్మెర్మ్‌ దానం చేశానని దురోవ్‌ అన్నారు. ఇక అప్పటి నుంచి తన వీర్యకణాల దానం కొనసాగుతోందన్నారు. 12 దేశాల్లోని 100 మందికిపైగా జంటలకు పిల్లలు కనడంలో సాయం చేశానన్నారు. ఆరోగ్యకరమైన స్పెర్మ్ కొరత ప్రపంచవ్యాప్తంగా చాలా తీవ్రమైన సమస్యగా మారింది, దానిని తగ్గించడంలో నా వంతు సహాయం చేసినందుకు నేను గర్విస్తున్నానని దురోవ్‌ వ్యాఖ్యానించారు. సంతానోత్పత్తి సవాళ్లను ఎదుర్కొంటున్న వారికి ఇది ఒక ముఖ్యమైన వనరుగా భావిస్తున్నానని తెలిపాడు.

Eha Tv

Eha Tv

Next Story