Thomas Matthew Crooks : ట్రంప్‌పై కాల్పులు జరిపిన క్రూక్స్‌ ఎలాంటివాడు?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై కాల్పులు జరిపిన 20 ఏళ్ల థామస్‌ మాథ్యు క్రూక్స్‌ ఫోటోను ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్ఇగేషన్ (ఎఫ్‌బీఐ) విడుదల చేసింది.

By :  Eha Tv
Update: 2024-07-15 10:37 GMT

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump)పై కాల్పులు జరిపిన 20 ఏళ్ల థామస్‌ మాథ్యు క్రూక్స్‌ ఫోటోను ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్ఇగేషన్ (ఎఫ్‌బీఐ) విడుదల చేసింది. శనివారం సాయంత్రం ఆరున్నర గంటలకు పెన్సిల్వేనియా ప్రావిన్స్‌లోని బట్లర్‌ పట్టణంలో డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఎదురుగా ఉన్న భవంతిపై నుంచి క్రూక్స్‌ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్‌ చెవికి తీవ్రగాయమయ్యింది. కాల్పులు జరిపిన తర్వాత క్రూక్స్‌ ఓ బిల్డింగ్‌ పై నుంచి మరో బిల్డింగ్‌పైకి దూకుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే ట్రంప్‌ను నీడలా రోజూ వెంట ఉండే సీక్రెట్‌ ఏజెంట్లు నిమిషాల వ్యవధిలోనే క్రూక్స్‌ను చంపేశారు. క్రూక్స్‌ ఎందుకీ పని చేశాడు? ట్రంప్‌పై ఎందుకంత కక్ష? ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎఫ్‌బిఐ అధికారులు. ఈ క్రమంలోనే క్రూక్స్‌ ఫోటోను విడుదల చేశారు.

సీక్రెట్‌ ఏజెంట్ల కాల్పులలో చనిపోయిన క్రూక్స్‌ మృత దేహం పక్కనే అసాల్ట్‌ రైఫిల్‌ ఏ-15ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్రూక్స్‌ బెతెల్‌ పార్క్‌ హై స్కూల్‌లో చదువుకున్నాడు. అక్కడ చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. స్కూల్‌లో నిర్వహించిన నేషనల్‌ మ్యాథ్స్‌, సైన్స్‌ ఇన్షియేటీవ్‌ కాంపిటీషన్‌లో అయిదు వందల డాలర్ల ప్రైజ్‌మనీని దక్కించుకున్నాడు కూడా! క్రూక్స్‌ ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాడని స్కూల్‌ ఫ్రెండ్స్‌ చెబుతున్నారు. రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడేవాడు కాదన్నారు. నవంబర్‌ 5 న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలలో మొదటిసారి ఓటు వేయడానికి తన పేరును నమోదు చేసుకున్నాడు క్రూక్స్‌. ఓటు వేయకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.ట్రంప్‌పై కాల్పులు జరిపిన క్రూక్స్‌ ఎలాంటివాడు?

Tags:    

Similar News