జననాల రేటు పెంచడానికట!
మనకు చాలా మంత్రిత్వ శాఖల(Ministry) గురించి తెలుసు! ఆయా శాఖలకు చెందిన బాధ్యతల గురించి కూడా తెలుసు. కానీ శృంగార మంత్రిత్వ శాఖ(Ministry Of Sex) గురించి ఎప్పుడైనా విన్నారా? ఇలాంటి శాఖ కూడా ఉంటుందా అని హాశ్చర్యపోకండి. రష్యా ప్రభుత్వం(Russia Government) ఇలాంటి శాఖను ఏర్పాటు చేయబోతున్నది. ఎందుకంటే అక్కడ జననాల రేటు(Population rate) దారుణంగా పడిపోయిందట! దాన్ని పెంచడం కోసం శృంగార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలనుకుంటోందట! ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా చాలా మంది చనిపోయారు. దీంతో రష్యా ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. జననాల రేటు పెంచడానికి మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే శృంగారం కోసం ప్రత్యేకంగా ఓ శాఖను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇందుకు మంత్రిత్వ శాఖ ఏం చేస్తుందన్న అనుమానాలు అక్కర్లేదు. ముందుగా రాత్రివేళ ఇంటర్నెట్ పూర్తిగా ఆఫ్ చేయడం, కరెంటు తీసేయడం వంటి పలు కార్యక్రమాలు చేపడుతున్నదట! దీనివల్ల జంటల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని, అలా జననాల రేటు పెరుగుతుందని రష్యా ప్రభుత్వం భావిస్తున్నది. 1999 తర్వాత తొలిసారి ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో జననాల రేటు దారుణంగా పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ప్రమాదం నుంచి బయటపడటానికి
మినిస్ట్రీ ఆఫ్ సెక్స్‌ను ఏర్పాటు చేయాలన్నడిమాండ్ ప్రజల నుంచే వస్తున్నదట! ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని చూసుకుంటున్న మహిళలకు కూడా జీతం ఇవ్వాలని భావిస్తోంది. అలాగే పెళ్లి తర్వాత హోటళ్లలో బస చేసే జంటకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించడానికి రెడీ అవుతోంది.