RoyalWeddingCake:రాణి ఎలిజబెత్ పెళ్లి కేక్ 77 ఏళ్ల తర్వాత వేలం..! ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా..!
1947లో క్వీన్ ఎలిజబెత్ మరియు ప్రిన్స్ ఫిలిప్ వివాహం కోసం తయారుచేసి కేక్ నుంచి ఒక ముక్క దాదాపు 77 ఏళ్ల తర్వాత వేలం నిర్వహించారు.
1947లో క్వీన్ ఎలిజబెత్ మరియు ప్రిన్స్ ఫిలిప్ వివాహం కోసం తయారుచేసి కేక్ నుంచి ఒక ముక్క దాదాపు 77 ఏళ్ల తర్వాత వేలం నిర్వహించారు. ఈ వేలంలో కేక్‌ను రూ.2.36 లక్షలు పలికింది. నవంబర్ 20, 1947న UK క్వీన్ ఎలిజబెత్ II, ప్రిన్స్ ఫిలిప్ వివాహ వేడుకలో కేక్‌ను అందించారు. దాదాపు ఎనిమిది దశాబ్దాల తర్వాత, చక్కగా చుట్టబడిన కేక్‌పై అప్పటి యువరాణి ఎలిజబెత్‌కు సంబంధించిన వెండి చిహ్నాన్ని ముద్రించిన చిన్న పెట్టెలో ఉంచారు. ఈ కేక్‌ను బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి ఎడిన్‌బర్గ్‌లోని హోలీరూడ్ హౌస్‌లోని హౌస్‌కీపర్‌కి, మారియన్ పోల్సన్‌కు వారి విలాసవంతమైన వివాహం తర్వాత రాజ దంపతులు బహుమతిగా పంపారు. లిజబెత్, ఫిలిప్ వివాహంలో 200 కిలోల 9 అడుగుల పొడవైన కేక్‌ను వినియోగించారు. వివాహ అతిథుల కోసం కేకును 2,000 స్లైస్‌లను కట్ చేసి, మిగిలిన కేక్‌ను స్వచ్ఛంద సంస్థలు ఇతర సంస్థలకు పంపారు. అందులో మిగిలిన పీస్‌లను వేలం నిర్వహించారు. దశాబ్దాల నాటి రాయల్ కేక్ ముక్కలు ఇంతకు ముందు అమ్ముడయ్యాయి. వాటిలో ఒకటి 2013లో 2,300 డాలర్లు పలికింది. అదేవిధంగా, కింగ్ చార్లెస్ మరియు ప్రిన్సెస్ డయానాల వివాహ వేడుకలో వడ్డించిన కేక్‌లో కొంత భాగం 2021లో జరిగిన వేలంలో 2,565 డాలర్లకు అమ్ముడుపోయింది.