Micro Soft : మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్.. నిలిచిపోయిన బ్యాంకింగ్ , విమాన సేవలు
ప్రముఖ సాఫ్ట్‌వేర్ మైక్రోసాఫ్ట్ విండోస్ (microsoft windows)లో సాంకేతిక సమస్య తలెత్తింది.
ప్రముఖ సాఫ్ట్‌వేర్ మైక్రోసాఫ్ట్ విండోస్ (microsoft windows)లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా పలు సేవలకు అంతరాయం ఏర్పడింది. అనేక మంది వినయోగదారులు తెగ ఇబ్బందులు పడ్డారు. విండోస్ యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ లోపం కనిపించింది. స్క్రీన్‌లపై ఈ ఎర్రర్ కనిపించిన వెంటనే సిస్టమ్ షట్‌డౌన్ లేదా రీస్టార్ట్ అవుతోంది. ఈ ప్రాబ్లమ్ ప్రపంచవ్యాప్తంగా కనిపించింది. దీంతో విమానాశ్రయాలు, టెలివిజన్ వార్తా స్టేషన్లు, పలు ఆర్థిక సంస్థలు సహా అనేక చోట్ల ఈ ప్రభావం కనిపించింది. దీంతో మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్ అయ్యిందని అనేక మంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమస్యకు కారణం ఇటీవల విడుదలైన CrowdStrike కావచ్చని భావిస్తున్నారు. CrowdStrike అనేది యాంటీ వైరస్. ఇది ఎండ్‌పాయింట్ సెక్యూరిటీ కంపెనీ. వినియోగదారులు ఈ BSOD లోపాన్ని పొందడం ప్రారంభించిన వెంటనే CrowdStrike సమస్య వచ్చింది. మన దేశంతో పాటు అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ, బ్యాంకులు తదితర సేవలకు అంతరాయం ఏర్పడుతోంది.