అగ్రరాజ్యం అమెరికాకు(America) రెండోసారి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించబోతున్న ట్రంప్‌(Donald Trump) కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోబోతున్నారు.

అగ్రరాజ్యం అమెరికాకు(America) రెండోసారి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించబోతున్న ట్రంప్‌(Donald Trump) కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోబోతున్నారు. ఇందులో ఒకటి అమెరికా ఆర్మీలో ఉన్న ట్రాన్స్‌జెండర్లను(Transgender) తొలగించడం.. ఈ విషయాన్ని ది సండే టైమ్స్‌(Sunday times) చెప్పింది.

ప్రమాణస్వీకారం తర్వాత ట్రంప్‌ ట్రాన్స్‌జెండర్లను తొలగించే ఫైల్‌పై సంతకం చేయనున్నట్లు ఆ పత్రిక తెలిపింది. ఓ వైపు ఆర్మీలోకి కొత్తవారి నియామకం అంతగా లేని ప్రస్తుత సమయంలో ట్రంప్‌ ట్రాన్స్‌జెండర్లను తొలగించడం సమంజసం కాదన్నది కొందరి అభిప్రాయం. ట్రాన్స్‌జెండర్లు ఆధునిక ఆర్మీ అవసరాలకు తగినట్లుగా సేవలందించడం లేదని. ట్రంప్‌ నిర్ణయం మంచిదేనని అని అంటున్నవారు కూడా లేకపోలేదు. మొత్తంగా ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. అయితే ఆర్మీ నుంచి తొలగించే ముందు ట్రాన్స్‌జెండర్లకు అన్ని గౌరవాలు ఇచ్చి పంపిస్తారని అంటున్నారు. ట్రంప్‌ మొదటి సారి అధ్యక్షుడు అయినప్పుడు కూడా ఇలాంటి వివాదాస్పద నిర్ణయమే తీసుకున్నారు. అయితే ట్రాన్స్‌జెండర్లను ఆర్మీలోకి తీసుకోవడాన్ని మాత్రమే ట్రంప్‌ నిషేధించారు. అప్పటికే ఉన్నవారిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను ట్రంప్‌ తర్వాత అధికారం చేపట్టిన బైడెన్‌ రద్దు చేశారు.

Eha Tv

Eha Tv

Next Story