Software Engineer : సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌.. అయినా ఆటో నడుపుతున్నాడు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!

నగర జీవితం దుర్భరం.. పొద్దున్నే కాసింత మెక్కేసి, కాదు కాదు కడుపులోకి కుక్కేసి ఇంటి నుంచి బయటపడితే పొద్దుగూకిన చాలా సేపటికి ఇంటికి చేరుకునే వాళ్లే ఇక్కడే ఎక్కువ. ఓ సరదా లేదు పాడూ లేదు.

By :  Eha Tv
Update: 2024-07-23 06:46 GMT

నగర జీవితం దుర్భరం.. పొద్దున్నే కాసింత మెక్కేసి, కాదు కాదు కడుపులోకి కుక్కేసి ఇంటి నుంచి బయటపడితే పొద్దుగూకిన చాలా సేపటికి ఇంటికి చేరుకునే వాళ్లే ఇక్కడే ఎక్కువ. ఓ సరదా లేదు పాడూ లేదు. పక్కోడితో నాలుగు మాటలు మాట్లాడదామన్నా టైమ్ ఉండటం లేదు. పైగా ఉద్యోగం కోసం కుటుంబాన్ని వదిలేసి నగరానికి వచ్చిన వారి పరిస్థితి అయితే మరింత దారుణం. ఒంటరితనం వారిని పీడిస్తుంటుంది. నలుగురితో కలవాలని, వారితో మాట్లాడాలని ఉన్నా కుదరడంలేదు. ఇలాంటి తపన ఉన్నవారు రకరకాల వ్యాపకాలు చేసుకుంటున్నారు. లేటెస్ట్‌గా ఓ నెటిజన్‌ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు ఆసక్తికరంగా ఉంది. తాను కోరమంగళలో ఓ ఆటోను బుక్‌ చేసుకున్నానని, ఆ ఆటో డ్రైవర్‌ మైక్రోసాఫ్ట్‌ లోగో ఉన్న హుడీని ధరించడం చూసి ఆశ్చర్యపోయానని నెటిజన్‌ చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే...'కాసేపయ్యాక అతడితో మాటలు కలిపాను. తాను మైక్రోసాఫ్ట్‌ ఇంజనీర్‌నని, ఒంటరితనాన్ని భరించలేక, నలుగురితో మాట్లాడే అవకాశం కోసం వీకెండ్స్‌లో ఆటో నడుపుతున్నానని చెప్పాడు. అతడు చెప్పింది విని షాకయ్యాను' అని నెటిజన్‌ రాసుకొచ్చారు. ఇంతకు ముందు కూడా ఓ మహిళ ఇలాంటి సంఘటననే చెప్పారు. తాను బుక్‌ చేసుకున్న ర్యాపిడో డ్రైవర్‌ ఓ ప్రముఖ కార్పొరేట్‌ సంస్థలో మేనేజర్‌ అని తెలుసుకుని ఆశ్చర్యపోయానని ఆమె చెప్పారు. బెంగళూరులోనే కాదు, హైదరాబాద్‌లో కూడా ఇలాంటి సంఘటనలు తరచూ తారసపడుతున్నాయి.

Tags:    

Similar News