అమెరికా అధ్యక్ష ఎన్నికలలో(US presidential election) రిపబ్లికన్‌ పార్టీ(Republic Party) అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో(US presidential election) రిపబ్లికన్‌ పార్టీ(Republic Party) అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో ఆయన అధ్యక్ష బాధ్యతలను చేపట్టబోతున్నారు. ట్రంప్‌ గెలిచారన్న విషయం తెలియగానే అమెరికాలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. అబార్షన్‌ మాత్రల(Abortion Pills) కోసం డిమాండ్‌ భారీగా పెరిగింది. ఒక్క రోజులోనే అబార్షన్‌ పిల్స్‌ కోసం పది వేలకు పైగా రిక్వెస్ట్‌లు వచ్చాయట! తాను అధికారంలోకి వస్తే అబార్షన్‌ రైట్స్‌ నిషేధిస్తానని ట్రంప్‌ చెప్పినట్టు కొన్ని వార్తలు వచ్చాయి. ఇందులో నిజమెంతో తెలియదు కానీ మాత్రల కొనుగోళ్లు మాత్రం భారీగా పెరిగాయి. 24 గంటల్లోనే అబార్షన్‌ పిల్స్‌ కోసం 10 వేలకు పైగా అభ్యర్థనలు రావడం విశేషం. రోజువారీ డిమాండ్‌ కంటే 17 రెట్లు ఎక్కువట! గర్భిణులు కాని వారు కూడా ప్రిస్కిప్షన్ కోసం ముందస్తుగా సంప్రదిస్తున్నారట! గర్భవిచ్ఛిత్తి మాత్రల కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేసేవారు కూడా ఎక్కువయ్యారట! ఇందకు ముందు రోజుకు నాలుగు నుంచి నాలుగున్నర వేల మంది వెబ్‌సైట్‌ చూస్తే ట్రంప్‌ గెలిచిన తర్వాత వెబ్‌సైట్‌ చూసేవారి సంఖ్య 82 వేలకు పెరిగింది. అంతేనా గర్భ నిరోధక పరికరాలు, వేసక్టమీ సర్జరీల గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అబార్షన్‌ హక్కుపై నిషేధం విధిస్తారనే ఆందోళన అయితే అమెరికా మహిళలలో ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా అబార్షన్‌ మాత్రలను నిల్వ చేసుకుంటున్నారు. ఇంతకు ముందు కూడా అంటే 2022 మే నెలలో కూడా ఇలాగే జరిగింది. అబార్షన్‌కు వ్యతిరేకంగా చట్టం రాబోతున్నదని ప్రచారం జరగడంతో అబార్షన్‌ మాత్రలకు గిరాకీ పది రెట్లు పెరిగింది.

Eha Tv

Eha Tv

Next Story