ఉపాధ్యాయ వృత్తికి ఆమె కళంకం తెచ్చింది. ఓ టీనేజ్‌ స్టూడెంట్‌తో(Teenage student) అనేక సార్లు శృంగారంలో(Physical relation) పాల్గొంది.

ఉపాధ్యాయ వృత్తికి ఆమె కళంకం తెచ్చింది. ఓ టీనేజ్‌ స్టూడెంట్‌తో(Teenage student) అనేక సార్లు శృంగారంలో(Physical relation) పాల్గొంది. అమెరికాలోని మేరీల్యాండ్‌లో(Marryland) ఈ సంఘటన జరిగింది. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఆ మహిళా టీచర్‌ మెలిసా కర్టిస్‌కు(Malisa kartis) 30 ఏళ్ల జైలు శిక్ష విధిచింది కోర్టు. 32 ఏళ్ల ఈ టీచర్‌కు థర్డ్‌ డిగ్రీ సెక్స్ అఫెన్స్‌ కింద శిక్ష విధించారు. శిక్ష పూర్తి అయిన తర్వాత కూడా కర్టిస్‌కు కొన్ని ఆంక్షలు పెట్టారు. ఆమె తన పిల్లలు తప్ప మైనర్లకు దూరంగా ఉండాలి. 8వ గ్రేడ్ చదువుతున్న ఓ స్టూడెంట్‌కు మ‌ద్యం తాగించడంతో పాటు మారిజోనా మ‌త్తుప‌దార్ధాన్ని ఇచ్చి అటు పిమ్మట ఆ కుర్రాడితో శృంగారంలో పాల్గొంది. దాదాపు 20 సార్లు ఆమె ఆ కుర్రాడితో సెక్స్‌ చేసినట్టు విచార‌ణ‌లో తేలింది. స్కూల్ టైం ముగిసిన త‌ర్వాత స్పెష‌ల్ క్లాసు పేరుతో ఇద్ద‌రు మాత్ర‌మే ఉండేవార‌ట! ఆ టైమ్‌లో ఆమె ఈ పని చేసేదని ప్రాసిక్యూట‌ర్ చెప్పారు.

Eha Tv

Eha Tv

Next Story