13 ఏళ్ల స్కూల్ పిల్లాడితో సెక్స్‌లో పాల్గొని ప్రెగ్నెంట్ అయిన మహిళా టీచర్
13 ఏళ్ల స్కూల్ పిల్లాడితో సెక్స్‌లో పాల్గొని ప్రెగ్నెంట్ అయిన మహిళా టీచర్
ఓ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకుని గర్భం దాల్చిన లారా అనే మహిళా టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూజెర్సీ ఎలిమెంటరీ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న లారా కారన్ ఐదో తరగతి చదువుతున్న విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకుని గర్భవతి అయింది. 2016 -2020 మధ్య విద్యార్థి తన ఇంట్లో ఆమెతో నివసించినప్పుడు విద్యార్థితో పలు మార్లు సెక్స్‌లో పాల్గొందీ మహిళా టీచర్. బాలుడి తల్లిదండ్రులతో పరిచయం తర్వాత.. ఆ విద్యార్థిని తన ఇంట్లోనే ఉంచుకుంది టీచర్. ఆ సమయంలో 28 ఏళ్ల లారా విద్యార్థితో అనుచిత సంబంధాన్ని ఏర్పరచుకుంది, చివరికి ఆమె గర్భవతి అయ్యేలా చేసింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లారాపై అభియోగాలు లైంగిక వేధింపులు, పిల్లల సంక్షేమానికి హాని కలిగించడం, మైనర్ భద్రత వంటి సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. లారా చర్యలు ఉపాధ్యాయ-విద్యార్థి సంబంధానికి అవమానకరమని ప్రాసిక్యూషన్ అభివర్ణించింది. ఆరోపణల నేపథ్యంలో, లారాను పాఠశాల నుంచి తొలగించారు. ఆమె నేరం రుజువైతే కఠిన శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది.