విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు భారతీయ విద్యార్థులకు మోజు తగ్గిపోతోంది.

విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు భారతీయ విద్యార్థులకు మోజు తగ్గిపోతోంది. గత ఏడాది లెక్కలు పరిశీలిస్తే విదేశాలకు వెళ్లిన విద్యార్థుల సంఖ్యలో 15 శాతం తగ్గుదల కనిపించింది. కొవిడ్‌ తర్వాత ఇలా తగ్గుదల నమోదవ్వడం ఇదే మొదటిసారి. 2023లో వీరు 8,92,989 మంది ఉండగా, 2024 నాటికి 7,59,064కు పడిపోయింది. ముఖ్యంగా, కెనడా, యూఎస్, యూకేలకు వెళ్లే వారి సంఖ్య భారీగా తగ్గిపోయిందని బ్యూరో ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌ డాటా నివేదించింది. 2024లో ఈ మూడు దేశాల్లోనే 27 శాతం విద్యార్థులు తగ్గినట్టు తెలిపింది. వీసా నిబంధనలు కఠిన తరం చేయడం, ఎక్కువ మొత్తంలో ఫీజులు, ఇతర ఆర్థిక డిమాండ్లు, పెరిగిన తిరస్కరణలు, ఆయా దేశాల్లోని దౌత్యపరమైన సమస్యలు ఈ తగ్గుదలకు కారణమని విశ్లేషించారు. ఇదే సమయంలో ప్రత్యామ్నాయ దేశాలైన రష్యా, జర్మనీ, ఉజ్బెకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరిగింది. బ్యూరో ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌ వెల్లడించిన డాటా ప్రకారం గత ఏడాదితో పోలిస్తే 2024లో యూఎస్‌, యూకే, కెనడా వెళ్లే విద్యార్థుల సంఖ్య 1,64,370 తగ్గింది. ఇందులో కెనడాకు 41 శాతం అధిక తగ్గుదల నమోదైంది. ఈ దేశానికి 2023లో 2,33,532 మంది వెళ్లగా, 2024లో ఈ సంఖ్య 1,37,608 మాత్రమే వెళ్లారు. అలాగే యూకే, అమెరికాలకు కూడా వరుసగా 27, 13 శాతం తగ్గుదల నమోదైంది. అయితే రష్యాకు 34 శాతం విద్యార్థుల సంఖ్య పెరిగింది. అందుబాటులో విద్య, సులభతరమైన వీసా విధానాలు, విద్యాసంస్థల భాగస్వామిక ఒప్పందాల వల్ల విద్యార్థులకు ప్రత్యామ్నాయ, ఆకర్షణీయ దేశంగా రష్యాగా చెప్తున్నారు.

ehatv

ehatv

Next Story