మన శరీరంలో కాలేయం ప్రాముఖ్యత చెప్పనవసరం లేదు. కానీ రోజురోజుకు కాలేయం ఆరోగ్యం క్షీణిస్తోంది.

మన శరీరంలో కాలేయం ప్రాముఖ్యత చెప్పనవసరం లేదు. కానీ రోజురోజుకు కాలేయం ఆరోగ్యం క్షీణిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాటీ లివర్ కేసులు పెరిగిపోతున్నాయి. కాలేయం మనం రక్తంలోని వ్యర్థాలను శుద్ధి చేయడంతో పాటు వందల పనులు చేసి పెడుతుంది. అయితే ఆరోగ్యం పై అవగాహన లేక లక్షలాదిమంది అనారోగ్యాన్ని కోరి తెచ్చుకుంటున్నారు. ఇటీవలే ఓ కార్పొరేట్ ఆసుపత్రి నిర్వహించిన సర్వేలో నగరాలు, పట్టణాలు, పల్లెలనే కాకుండా 55% మందికి ఫ్యాటీ లివర్ సమస్యలు ఉన్నట్టు తేలింది. దీనికి ముఖ్య కారణం జీవనశైలియే అని చెప్తున్నారు. కదలకుండా ఒకే దగ్గరే ఉండడం, బరువు పెరిగిపోవడం, అతిగా మద్యం సేవించడం వల్ల ఈ కాలేజీ సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్రతి చిన్నదానికి అంటే తుమ్మినా, దగ్గినా టాబ్లెట్లు వాడడం లివర్ పై అధిక భారం పడుతుంది. ఉప్పు, చక్కెర, నూనె అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం కూడా కాలేయంపై ప్రభావం చూపుతుంది. ప్రతిరోజు గంటపాటు వ్యాయామం చేయడం, మద్యం సేవించడం తగ్గించడం, పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకోవడం, ఉప్పు చక్కెర నూనె లేని పదార్థాలను తీసుకోవడం కాలేయ పనితీరును మెరుగుపరుస్తుందని వైద్యులు చెప్తున్నారు. కాలేయ వ్యాధి తొందరగా బయటపడదని, అది బయటపడేసరికి వ్యాధి ముదిరి పోతుందని, తరచుగా యువర్ టెస్టులు నిర్వహించుకోవాలని ఆరోగ్య రంగా నిపుణులు సూచిస్తున్నారు.

ehatv

ehatv

Next Story