కోవిడ్-19 మహమ్మారికి కారణమైన SARS-CoV-2 అనే వైరస్ ఇన్ఫెక్షన్ తర్వాత కొన్నాళ్ల పాటు పుర్రె, మెనింజెస్లో ఉండవచ్చని జర్మన్ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది.
కోవిడ్-19 మహమ్మారికి కారణమైన SARS-CoV-2 అనే వైరస్ ఇన్ఫెక్షన్ తర్వాత కొన్నాళ్ల పాటు పుర్రె, మెనింజెస్లో ఉండవచ్చని జర్మన్ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. హెల్మ్హోల్ట్జ్ మ్యూనిచ్, లుడ్విగ్-మాక్సిమిలియన్స్-యూనివర్సిటాట్ పరిశోధకులు వైరస్ స్పైక్ ప్రోటీన్ మెదడు యొక్క రక్షిత పొరలు, మెనింజెస్ మరియు పుర్రె యొక్క ఎముక మజ్జలలో నాలుగు సంవత్సరాల వరకు ఉంటుందని కనుగొన్నారు. ఈ ప్రోటీన్లు దీర్ఘకాలిక రోగాలను ప్రేరేపిస్తాయి, న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయి. హెల్మ్హోల్ట్జ్ మ్యూనిచ్‌లోని ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటెలిజెంట్ బయోటెక్నాలజీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ అలీ ఎర్టార్క్, వైరస్ వల్ల దీర్ఘకాలిక నరాల ప్రభావాలు వేగవంతమైన మెదడు వృద్ధాప్యానికి దారితీస్తాయని, ఫలితంగా ఐదు నుంచి 10 సంవత్సరాల ఆరోగ్యకరమైన మెదడు పనితీరును కోల్పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు.తలనొప్పి, నిద్ర లేమీ,బలహీనత వంటి దీర్ఘకాల కోవిడ్ నాడీ సంబంధిత లక్షణాలపై కూడా అధ్యయనం వివరాలు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ల మంది కోవిడ్ రోగులలో 5-10% మంది కోవిడ్ ద్వారా సంభవించిన ఇన్ఫెక్షన్తో ప్రభావితమవుతారని అంచనా వేశేరు. మెదడులో ఇన్ఫెక్షన్ తగ్గించడంలో టీకాలు కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు.