పిండ ప్రదానం(Pinda pradhan) అనేది హిందూ పూర్వీకులను గౌరవించడానికి, ప్రార్థనలు చేయడానికి నిర్వహించే పవిత్రమైన ఆచారం.

పిండ ప్రదానం(Pinda pradhan) అనేది హిందూ పూర్వీకులను గౌరవించడానికి, ప్రార్థనలు చేయడానికి నిర్వహించే పవిత్రమైన ఆచారం. మరణించిన కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి, మోక్షాన్ని అందజేస్తుందని నమ్ముతున్నందున ఈ ఆచారం అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. బీహార్‌లోని(Bihar) గయా(Gayaa) పిండ ప్రదానం నిర్వహించడానికి అత్యంత ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటిగా చెప్తారు.

రాముడు(Lord Ram) తన తండ్రి దశరథ రాజు కోసం పిండ ప్రదానం చేసిన ప్రదేశం గయా అని చెప్తారు. గయాలోని విష్ణుపాద ఆలయం, విష్ణువు పాదముద్రను కలిగి ఉంటుంది. ఇది మతపరమైన ప్రాముఖ్యతకు మరొక కారణం. గయాలో పిండ ప్రదానం చేయడంతో పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరుతుందని నమ్మకం. పిండ ప్రదానం నిర్వహించడానికి గయా ప్రాముఖ్యతను మహాభారతంలో కూడా ప్రస్తావించారు. పెద్ద పాండవుడైన యుధిష్ఠిరుడు గయాలో ఆచారాన్ని ఎలా నిర్వహించాలో శ్రీకృష్ణుడి నుంచి మార్గదర్శకత్వం పొందాడని చెప్తారు. గయా గుండా ప్రవహించే పవిత్రమైన ఫాల్గు నది దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పెంచుతుంది. నదీ జలాలు కూడా శుద్ధీకరణ లక్షణాలను కలిగి ఉందని నమ్ముతారు. విష్ణు ఆలయం, ప్రెత్శిల కొండతో పాటు గయాలోని పెద్దచెరువు అయిన బ్రహ్మకుండ్‌లో పవిత్ర స్నానం చేస్తారు. ఇక్కడ అక్ష్యవత్‌ చెట్టు ఉంటుంది, ఈ చెట్టుకింద రాముడు పిండ ప్రదానం చేశారని ప్రతీతి. ఫాల్గు నదిలో స్నానం చేయడంతో విముక్తి పొందుతారని, ఆత్మలకు మోక్షం లభిస్తుందని చెప్తారు.

Eha Tv

Eha Tv

Next Story