Tholi ekadasi 2024 : ఎల్లుండే తొలి ఏకాదశి... ఏ వ్రతం చేయాలి?

ప్రతి నెల ఏకాదశి తిథి రెండుసార్లు వస్తుంది. అంటే ఏడాదికి 24 ఏకాదశులు అన్నమాట! వీటన్నింటిలోకి దేవశయని ఏకాదశికి ప్రత్యేక స్థానం ఉంది. ఆషాఢమాసంలో వచ్చే ఈ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. శయనైక ఏకాదశి, హరి వాసరం, పేలాల పండుగగా కూడా పిలుస్తారు.

By :  Eha Tv
Update: 2024-07-15 11:12 GMT

ప్రతి నెల ఏకాదశి తిథి రెండుసార్లు వస్తుంది. అంటే ఏడాదికి 24 ఏకాదశులు అన్నమాట! వీటన్నింటిలోకి దేవశయని ఏకాదశికి ప్రత్యేక స్థానం ఉంది. ఆషాఢమాసంలో వచ్చే ఈ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. శయనైక ఏకాదశి, హరి వాసరం, పేలాల పండుగగా కూడా పిలుస్తారు. తొలి ఏకాదశి జూలై 16 వ తేదీ మంగళవారం రాత్రి 8:33 గంటలకు ప్రారంభమవుతుంది. జూలై 17వ తేదీ బుధవారం రాత్రి 9:02 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం.. ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జూలై 17న జరుపుకుంటారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు క్షీర సాగరంలో యోగ నిద్రకు చేరుకుంటాడు. దీంతో ఈ రోజు నుండి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ నాలుగు నెలల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు. దేవశయని ఏకాదశి నుంచి దేవతని ఏకాదశి వరకు శుభకార్యాలు చేయడం పై నిషేధం ఉంది. దేవశయని ఏకాదశిని హరిశయని, పద్మనాభ, యోగనిద్ర ఏకాదశి, తొలి ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, నియమ నిష్ఠలతో విష్ణువుతో పాటు లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల శ్రీ హరి అనుగ్రహంతో జీవితంలో సుఖసంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయి. ఉపవాసం ఉన్నవారు ఉదయం సమయంలో పారణం చేయలేకపోతే.. ద్వాదశి తిథి రోజున ఉదయం స్నానం చేసి.. విష్ణువుని పూజించాలి. అనంతరం బ్రాహ్మణులకు అన్నదానం చేసి ఆ తర్వాతే ఉపవాసం విరమించాలీ.

విష్ణువుకు తులసి అంటే చాలా ఇష్టం. కనుక తులసి లేని విష్ణువు పూజ అంగీకారం కాదని విశ్వాసం. అందుకే విష్ణువు కోసం చేసే పూజ, ఉపవాసంలో తులసిని తప్పనిసరిగా ఉపయోగించాలి. ఏకాదశి వ్రతం విరమించాలంటే తులసి దవళంను నోట్లో వేసుకోవచ్చు. విష్ణువు ఉసిరి చెట్టుపై నివసిస్తాడన్నది మన నమ్మకం . అందుకే ఏకాదశి వ్రతంలో ఉసిరికాయకు ప్రత్యేక స్థానం ఉంది. ఇదిలా ఉంటే ఏకాదశి వ్రతం విరమణ సమయంలో తప్పనిసరిగా అన్నం తినాలి. ఏకాదశి ఉపవాసం రోజు అన్నం తినడం నిషిద్ధం..అయితే ద్వాదశి రోజు అన్నం తినడం ఉత్తమమైనదిగా భావిస్తారు. అలాగే ఏకాదశి వ్రతం పాటించేటప్పుడుఆహారంలో కొన్ని వస్తువులను ఉపయోగించకూడదు. ముల్లంగి, బెండకాయ, ఆకుకూరలు, కాయధాన్యాలు, వెల్లుల్లి-ఉల్లిపాయలు మొదలైన వాటిని ఉపవాసం విరమించేటప్పుడు వాడకూడదు. బెండకాయ పిత్త దోషాన్ని పెంచుతుంది. ముల్లంగిలో చల్లని స్వభావం ఉంటుంది కాబట్టి ఉపవాసం చేసిన వెంటనే తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. వెల్లుల్లి, ఉల్లిపాయలు తామసిక ఆహారం కాబట్టి పూజ సమయంలో వీటిపై నిషేధం విధించారు.

Tags:    

Similar News