ప్రేమ పేరుతో మోసపోయానన్న ఆవేదనతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.

ప్రేమ పేరుతో మోసపోయానన్న ఆవేదనతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. నిడమనూరు మండలం బొక్కమంతలపహాడ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిని అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. యువతి కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం రాత్రి కోదాడ–జడ్చర్ల రహదారిపై బొక్కమంతలపహాడ్ గ్రామంలో రాస్తారోకో చేపట్టారు. బొక్కమంతలపహాడ్(Bokkamantalapahad) గ్రామానికి చెందిన ధర్మారపు మల్లేశ్వరి(Malleshwari) హైదరాబాద్(Hyderabad)లోనే సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి హాస్టల్‌లో ఉంటూ నిమ్స్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. అదే గ్రామానికి కుక్కల జాన్‌రెడ్డి కూడా హైదరాబాద్‌లోనే రీహాబిలిటేషన్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. ఒకే గ్రామం కావడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. జాన్‌రెడ్డి ఈ మధ్య మరో యువతిని వివాహం చేసుకోవడంతో అది భరించలేక మల్లేశ్వరి ఆదివారం హాస్టల్‌లో విషపూరితమైన ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ సిబ్బంది గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులు, బంధువులు మల్లేశ్వరి మృతదేహాన్ని బొక్కమంతలపహాడ్ గ్రామానికి తమకు న్యాయం చేయాలని జడ్చర్ల– కోదాడ రోడ్డులో ఆందోళన చేపట్టారు.
