చెన్నైకి సమీపాన ఉన్నమామల్లపురంలో ప్రియుడితో లాడ్జికి వెళ్లిన ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

చెన్నైకి సమీపాన ఉన్నమామల్లపురంలో ప్రియుడితో లాడ్జికి వెళ్లిన ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈకేసులో ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. చెన్నై చెంగల్పట్టు జిల్లా మధురాంతకం పక్కన చిత్రవాడి గ్రామానికి చెందిన జయరాజ్‌(Jayaraj)(28)కు భార్య, ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు. మేళవలంపేటలోని ఓ పురుగు మందుల దుకాణంలో పనిచేస్తున్నాడు. పౌన్‌సూరులో నివాసముంటున్న సంగీత(32)కు 17 ఏళ్ల కుమార్తె, 15 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కాట్టంకొళత్తూరు ప్రాంతంలోని ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో సంగీత సెక్యూరిటీ గార్డుగా పని చేస్తోంది. ఉద్యోగానికి వెళుతున్న సమయంలో సంగీతకు జయరాజుతో వివాహేతర సంబందం ఏర్పడింది. ఏర్పడినట్లు తెలుస్తుంది. ఈమె 'పక్క' సంబంధం భర్తకు తెలియడంతో భార్యను మందలించాడు. ఐదేళ్ల క్రితం భర్తను విడిచిపెట్టిన సంగీత గూడువాంచేరిలోని తన తల్లి ఇంట్లో ఉంటోంది. కానీ జయరాజ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ రోజు జయరాజుతో కలిసి మామల్లపురం వెళ్లింది. అక్కడి హోటల్‌లో దిగారు. అక్కడ ఆమె సెల్‌ఫోన్‌ను తనిఖీ చేసిన జయరాజ్‌ ఇంత మందితో ఎందుకు మాట్లాడుతున్నావని ప్రశ్నించాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాసేపటి తర్వాత ఫుడ్ కోసమని జయరాజ్‌ బయటకు వెళ్లి వచ్చే సరికి సంగీత ఉరివేసుకొని ఉంది. దీనిపై మామల్లపురం డిప్యూటీ సూపరింటెండెంట్‌ రవి అభిరామ్, మామల్లపురం పోలీసులు అక్కడికి చేరుకుని సంగీత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించారు. ఈ విచారణలో సంగీతను కొట్టి, గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్టుమార్టంలో తేలింది.. పలువురితో సన్నిహితంగా ఉండడంతోనే సంగీతను గొంతు నులిమి హత్య చేశానని తెలిపాడు. హత్యను కప్పిపుచ్చాలని సంగీత దుపట్టా చించి ఆమె శరీరాన్ని విద్యుత్‌ ఫ్యాన్‌కి వేలాడదీశానని పోలీసులకు తెలిపాడు.

ehatv

ehatv

Next Story