Crime : మంచిర్యాలలో మహిళపై రౌడీ షీట్ ఓపెన్ చేసిన పోలీసులు
మహిళలపై రౌడీ షీట్ ఓపెన్ చేయడమన్నది అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుంది.
మహిళలపై రౌడీ షీట్ ఓపెన్ చేయడమన్నది అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే తెలంగాణలోని మంచిర్యాలలో మహిళపై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అందుకు కారణం ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉన్న క్రైమ్ లే కారణం.
చెన్నూరులో ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ (పీవోడబ్ల్యూ) నేతగా ఉన్న మహిళపై పోలీసులు శనివారం నాడు రౌడీషీట్ తెరిచారు. నిందితురాలు శ్రీరాంపూర్‌కు చెందిన మద్దెల భవాని అని చెన్నూరు ఇన్‌స్పెక్టర్ కె.రవీందర్ తెలిపారు.ఆమె భూ వివాదాల్లో జోక్యం చేసుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఆమెపై చెన్నూరు పోలీస్ స్టేషన్‌లో ఏడు కేసులు, కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యాయి. ఆమెపై ఇప్పటికే చెన్నూరు పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ తెరిచారు. మహిళ తీరు మార్చుకోకపోతే ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) చట్టం ప్రయోగిస్తామని ఇన్‌స్పెక్టర్ హెచ్చరించారు. భూ వివాదాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు, నిషిద్ధ పదార్థాల స్మగ్లింగ్, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై ఈ చట్టం ప్రయోగించబడుతుందని ఆయన తెలిపారు. పలువురు క్రిమినల్స్ తమ రాడార్ లో ఉన్నారని, పోలీసులు వారికి తగిన శిక్ష పడేలా చేస్తారని హెచ్చరించారు.