చిత్తూరు జిల్లా చంద్రగిరి నర్సింగాపురంలో నిఖిత అనే యువతి అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది.

చిత్తూరు జిల్లా చంద్రగిరి నర్సింగాపురంలో నిఖిత అనే యువతి అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. నిఖిత(Nikitha)ను తల్లే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కూతురు ప్రేమ విషయం నచ్చక తల్లే ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిఖిత తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నర్సింగాపురంలో ఉంటున్న కిషోర్, సుజాతకు నిఖిత అనే కూతురు ఉంది. నిఖిత ఇంకా మైనర్‌గా ఉంది. అయితే నిఖిత మిట్టపాలెంకు చెందిన అజయ్‌(Ajay)ను ప్రేమించింది. గత ఏడాది నిఖితకు గర్భం కూడా రావడంతో తల్లి గర్భస్రావం చేసింది. ఆ సమయంలో అజయ్‌పై పోక్సో చట్టం కింద ఫిర్యాదు చేసింది తల్లి. ఈ కేసులో అరెస్టయి జైలులో ఉన్నా కూడా నిఖిత తన ప్రేమను కొనసాగించింది. అజయ్‌ను పలుసార్లు కలిసింది. బెయిల్‌పై బయటకు వచ్చిన అజయ్‌ను తరుచుగా నిఖిత కలుస్తోంది. ఈ విషయం తెలిసిన తల్లి కూతురు నిఖితపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు మందలించినా నిఖిత తన వైఖరిని మార్చుకోలేదు. చుట్టాలు, చుట్టుపక్కలవారికి ఈ విషయం తెలుస్తే తమ పరువుపోతుందని నిఖితను చంపాలని తల్లి, తండ్రి మాట్లాడుకున్నారు. వీరి మాటలను విన్న నిఖిత అజయ్‌కు కూడా చెప్పింది. తొలుత విషం పెట్టి చంపాలనుకున్నారు. కానీ అది విన్న నిఖిత, ఆహారం తినేందుకు నిరాకరించేది. ఈ క్రమంలో నిద్రిస్తున్న నిఖితను దిండుతో ఊపరి ఆడకుండా చేసి చంపారు. సాధారణ మరణమని నమ్మించి నిఖిత శవాన్ని దహనం చేశారు. వారం తర్వాత ఆ నోటా ఈ నోటా పడ్డ పోలీసులకు చేరింది. నిఖితది అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసుకొని విచారించారు. విచారణలో భాగంగా తల్లిదండ్రులైన కిషోర్(Kishore), సుజాత(Sujatha)ను అదుపులోకి తీసుకొని లోతుగా విచారించగా నిఖితను తల్లే హత్య చేసినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు.

ehatv

ehatv

Next Story