Hyderabad : మలక్‌పేట మెట్రో స్టేషన్‌ సమీపంలో రౌడీషీటర్ దారుణ‌ హత్య

హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌ సమీపంలోని మల‌క్‌పేట్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో శుక్రవారం రాత్రి ఓ రౌడీషీటర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు

By :  Eha Tv
Update: 2024-06-29 04:45 GMT

హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌ సమీపంలోని మల‌క్‌పేట్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో శుక్రవారం రాత్రి ఓ రౌడీషీటర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. సంఘటనా స్థలానికి చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ 100 మీటర్ల దూరంలో ఉంది.

రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన రౌడీ షీటర్ నజాఫ్‌ను గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు రోడ్డుపైనే కార్నర్ చేసి దారుణంగా హత్య చేశారు. మలక్‌పేట మెట్రో స్టేషన్ మెట్ల దగ్గర అతని మృతదేహం పడి ఉంది. ఘటనాస్థలికి సమీపంలో అమర్చిన సీసీ కెమెరాల్లో హత్య దృశ్యాలు రికార్డయ్యాయి. నజాఫ్‌కు గతంలో మూడు హత్యలు, కొన్ని హత్యాయత్న కేసుల్లో ప్రమేయం ఉంది.

నజాఫ్‌ను హ‌తమార్చేందుకు ప్రత్యర్థులు అవకాశం కోసం చూసారని.. సరైన సమయం దొరకడంతో అతడిని అంత‌మొందించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News