బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లోని తన నివాసంలో ఓం ప్రకాశ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు.

బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లోని తన నివాసంలో ఓం ప్రకాశ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆయన శరీరంపై కత్తిపోట్లు, తీవ్రగాయాలను పోలీసులు గుర్తించారు. ఓం ప్రకాశ్ భార్య పల్లవి ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. ఆమెను, కూతురును కృతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్లవి తన స్నేహితురాలికి ఫోన్‌లో "నేను రాక్షసుడిని చంపేశాను" అని చెప్పినట్లు తెలుస్తోంది.

పోలీసుల విచారణలో ఓం ప్రకాశ్(Om Prakash) ముఖంపై పల్లవి మిరప పొడి చల్లి, కత్తితో 10-12 సార్లు పొడిచి హత్య చేసినట్లు తెలిసింది. గాజు బాటిల్‌తో కూడా దాడి జరిగినట్లు సమాచారం. దీర్ఘకాలంగా ఓం ప్రకాశ్, పల్లవిల మధ్య వైవాహిక విభేదాలు ఉన్నాయి. ఆస్తి వివాదం ఒక కారణంగా చెబుతున్నారు, పల్లవి(Pallavi), కృతి ఇద్దరూ మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుమారుడు కార్తీకేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓం ప్రకాశ్ కుమారుడు కార్తీకేష్ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్(FIR) నమోదైంది. శవపరీక్ష కోసం మృతదేహాన్ని సెయింట్ జాన్స్ హాస్పిటల్‌కు తరలించారు. ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. పల్లవి, కృతిపై హత్య నేరం కింద కేసు నమోదైంది. ఓం ప్రకాశ్ 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, బీహార్‌లోని చంపారన్ స్వస్థలం. 2015-2017 మధ్య కర్నాటక డీజీపీగా పనిచేశారు.

ehatv

ehatv

Next Story