Stock Market : నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

వారంలో మూడో రోజు ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్‌మార్కెట్లు మందకొడిగా ప్రారంభమయ్యాయి

Update: 2024-09-11 05:10 GMT

వారంలో మూడో రోజు ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్‌మార్కెట్లు మందకొడిగా ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 150 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 25,000 స్థాయి నుంచి కింద‌కు జారింది. ఉదయం 9:25 గంటలకు సెన్సెక్స్ 110.06 (0.13%) పాయింట్లు పడిపోయి 81,800.72 స్థాయికి చేరుకుంది. నిఫ్టీ 7.10 (0.03%) పాయింట్ల క్షీణతతో 25,034.00 వద్ద ట్రేడవుతోంది. బుధవారం మార్కెట్ ప్రారంభమైన తర్వాత.. సుజ్లాన్ షేర్లు 3% లాభపడగా.. టాటా మోటార్స్ షేర్లు 3% పడిపోయాయి.

దేశీయ ఈక్విటీ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీలు బుధవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ మార్కెట్ల మందగమనంతో మార్కెట్‌పై ప్రభావం పడింది. అమెరికాలో ద్రవ్యోల్బణం డేటా కోసం ఎదురుచూస్తూ ఇన్వెస్టర్లు సహనం పాటిస్తున్నారు. ఈ డేటా ఫెడరల్ రిజర్వ్ యొక్క రాబోయే రేటు నిర్ణయాన్ని ప్రభావితం చేయనుంది.

సెన్సెక్స్ షేర్లలో టాటా మోటార్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టైటాన్, టెక్ మహీంద్రా రెడ్ మార్క్‌లో ప్రారంభమవ్వగా, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, ఐటిసి, హెచ్‌యుఎల్, బజాజ్ ఫైనాన్స్ గ్రీన్ మార్క్‌లో ప్రారంభమయ్యాయి.

ఎలక్ట్రిక్ వాహనాలు, ప్రముఖ కార్ల ధరలను రూ. 2.05 లక్షల వరకు తగ్గించిన తర్వాత టాటా మోటార్స్ షేర్లు ప్రారంభ ట్రేడింగ్‌లో 4% కంటే ఎక్కువ పడిపోయాయి. గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ UBS కూడా కంపెనీ షేర్లపై రూ. 825 టార్గెట్ ధరతో 'అమ్మకం' రేటింగ్‌ను జారీ చేసింది.

Tags:    

Similar News