గోల్కొండ వజ్రం వేలం వేసేందుకు వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

గోల్కొండ వజ్రం వేలం వేసేందుకు వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్రిస్టీస్ మాగ్నిఫిసెంట్ జ్యూవెల్స్ వేలం, ఫోర్ సీజన్స్ హోటల్ డెస్ బెర్గ్యూస్, జెనీవా, స్విట్జర్లాండ్‌లో మే 14న ఈ వేలం జరగనుంది. 23.24 క్యారెట్ల ఫ్యాన్సీ వివిడ్ బ్లూ డైమండ్ అంచనా ధర సుమారు రూ.300 కోట్ల నుంచి రూ.430 కోట్ల వరకు పలకునన్నట్లు తెలుస్తోంది. ఈ డైమండ్‌ను ప్రముఖ పారిసియన్ జ్యూవెలర్ JAR రూపొందించిన కాంటెంపరరీ రింగ్‌లో సెట్ చేశారు. ఇది ఇప్పటివరకు వేలంలోకి వచ్చిన అతిపెద్ద ఫ్యాన్సీ వివిడ్ బ్లూ డైమండ్(Vivid Blue Diamond). గోల్కొండ డైమండ్స్ అంటే అసాధారణమైన స్వచ్ఛత, పారదర్శకత కలిగినవి. ఈ బ్లూ డైమండ్(Blue Diamond) టైప్ IIa కేటగిరీలోకి వస్తుంది, అంటే దాదాపు నైట్రోజన్ లేని, అత్యంత శుద్ధమైన డైమండ్. గోల్కొండ గనులు ప్రస్తుత తెలంగాణలోని కొల్లూరు.. ఇవి 2000 సంవత్సరాలకు పైగా ప్రపంచంలోని ఏకైక డైమండ్ సోర్స్‌గా ఉండేవి.

1920లలో ఇండోర్ మహారాజా యశ్వంత్ రావు హోల్కర్ II వద్ద ఉండేది. ఆయన తండ్రి 1923లో ఫ్రెంచ్ జ్యూవెలర్ చౌమెట్ ద్వారా దీన్ని బ్రాస్‌లెట్‌లో సెట్ చేయించారు. 1930లలో మౌబౌసిన్ అనే జ్యూవెలర్ దీన్ని ఇండోర్ పియర్స్ మరో రెండు గోల్కొండ డైమండ్స్ తో కలిపి నెక్లెస్‌గా రీడిజైన్ చేశారు. ఈ నెక్లెస్‌ని ఇండోర్ మహారాణి సన్యోగితాబాయి దేవి ధరించారు, దీన్ని బెర్నార్డ్ బౌటెట్ డి మోన్వెల్ చిత్రంలో డాక్యుమెంట్ చేశారు. 1947లో, భారత స్వాతంత్ర్యం తర్వాత, ఈ డైమండ్‌ను న్యూయార్క్ జ్యూవెలర్ హ్యారీ విన్‌స్టన్ కొనుగోలు చేశారు. ఆయన దీన్ని వైట్ డైమండ్‌తో బ్రూచ్‌గా సెట్ చేసి, బరోడా మహారాజాకు విక్రయించారు. ఆ తర్వాత ప్రైవేట్ ఓనర్‌షిప్‌లోకి వెళ్లి, ఇప్పుడు మొదటిసారి ఓపెన్ వేలంలోకి వస్తోంది. గోల్కొండ డైమండ్స్ వాటి "వైటర్ దాన్ వైట్" కలర్, అసాధారణ స్వచ్ఛతకు ప్రసిద్ధి. ఈ బ్లూ డైమండ్ అరుదైన ఫ్యాన్సీ వివిడ్ బ్లూ కలర్‌లో ఉంది, ఇది డైమండ్స్‌లో చాలా రేర్. దీని రాయల్ హెరిటేజ్, చౌమెట్, మౌబౌసిన్, హ్యారీ విన్‌స్టన్, JAR వంటి ఐకానిక్ జ్యూవెలర్స్ ద్వారా రీడిజైన్ కావడం దీన్ని హిస్టారికల్ జెమ్‌గా చేస్తుంది. గోల్కొండ డైమండ్స్ ఎప్పుడూ వేలంలో హై డిమాండ్‌లో ఉంటాయి. గతంలో ప్రిన్సీ డైమండ్ 34.65 క్యారెట్ల, ఫ్యాన్సీ ఇంటెన్స్ పింక్ 2013లో క్రిస్టీస్ వేలంలో సుమారు రూ.240 కోట్లకు వేలం వేశారు. ఇది గోల్కొండ డైమండ్ కోసం హైయెస్ట్ రికార్డ్.

ఆర్చ్‌డ్యూక్ జోసెఫ్ డైమండ్ 76.02 క్యారెట్లు, కలర్‌లెస్‌ను 2012లో క్రిస్టీస్ జెనీవాలో సుమారు రూ.118 కోట్లుకు విక్రయించబడింది.

బ్యూ సాన్సీ 34.98 క్యారెట్ల 2012లో సోథబీస్ జెనీవా వేలంలో సుమారు రూ.9.8-19.6 కోట్లు

ehatv

ehatv

Next Story