ఈ రోజు ఏ రాశివారికి శుభ ఫలితాలు ఉన్నాయి?

తేది : 20, సెప్టెంబర్ 2024

సంవత్సరం : శ్రీ క్రోధినామ సంవత్సరం

ఆయనం : దక్షిణాయనం

ఋతువు : వర్ష ఋతువు

మాసము:- భాద్రపదం మాసం

పక్షం : కృష్ణ పక్షం

తిథి : తదియ

ఈరోజు రాత్రి 1 గం 26 ని వరకు

వారము :- శుక్రవారం

⭐నక్షత్రం : రేవతి

( ఈరోజు ఉదయం 9 గం 27 ని వరకు

వర్జ్యం : ( రాత్రి తెల్లవారుజామున 4 గం 06 ని నుండి 5 గం 36 ని వరకు

అమ్రుతఘడియలు :- ఉదయం 7 గం 26 ని నుండి 8 గం 55 ని వరకు

దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 08 గం॥ 24ని॥ నుంచి 09 గం॥ 12ని॥ వరకు)పునః ప.12-24ని నుండి 1-12ని వరకు

రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ నుంచి 12గం॥ 00 ని॥ వరకు)

☀️సూర్యోదయం : ఉదయం 5 గం॥ 50 ని॥ లకు.

🌤సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 03 ని॥ లకు.

Today Rasi Phalalu : ఈ రోజు ఏ రాశివారికి శుభ ఫలితాలు ఉన్నాయి?

మేషం(Mesha Rasi) : ఈ రాశివారికి శుభఫలితాలు ఉన్నాయి. ధనలాభం ఉంది. అపరిష్కృతంగా ఉన్న ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. కొత్త వస్తువులు కొంటారు. దుర్గాస్తోత్రం చదవాలి.

వృషభం(Vrushabha Rasi) : ఈ రాశివారు చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేసి అందరి మెప్పు పొందుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు దక్కుతుంది.. నవగ్రహ శ్లోకాలు చదవడం మంచిది

మిథునం(Mithuna rasi) : ఈ రాశివారు లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగి మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కీలక విషయాల్లో సన్నిహితుల సలహాలు తీసుకోండి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండిండి. సమయాన్ని వృథా చేయకండి. నవగ్రహ ఆరాధన చేయండి.

కర్కాటకం(Karkataka rasi) : ఈ రాశివారికి ఇవాళ శుభఫలితాలు ఉన్నాయి. కచ్చితమైన ఆలోచనలతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రారంభించిన పనిలో విజయం చేకూరుతుంది. ఒక శుభవార్త మీ కుటుంబంలో నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం.

సింహం(Simha Rasi) : ఈ రాశివారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి.వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి.

కన్య(Kanya rasi) : ఈ రాశివారు మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. . కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యమని మరువద్దు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి.

తుల(Thula) : ఈ రాశివారు ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా పనులు చేయండి. సమస్యలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు . మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఫలితం ఉంటుంది.

వృశ్చికం (Vruchikam) : ఈ రాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ధృడమైన మనస్సుతో ముందుకు సాగండి. ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుప్రీతి ఉంది. భోజన సౌఖ్యం కలదు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

ధనుస్సు(Dhanussu Rasi) : ఈ రాశివారు మంచి మనస్సుతో చేసే పనులు త్వరగా నెరవేరుతాయి. ఒక సంఘటన మీ మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. సుబ్రహ్మణ్యస్వామిని పూజించండి.

మకరం(Makara rasi) : ఈ రాశివారికి ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.నవగ్రహ ఆరాధన చేయండి.

కుంభం(Kumbam) : ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆచితూచి ముందుకు సాగాలి. అధికారులతో నమ్రతగా ప్రవర్తించాల్సి ఉంటుంది. మీరు చేయని పొరపాటుకు నింద పడాల్సి రావచ్చు. దైవారాధన చేయండి.

మీనం(Meenam) : ఈ రాశివారికి ఒక వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. మనఃస్సౌఖ్యం ఉంటుంది. ఇంటి వ్యవహారాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ బేధాలు వస్తాయి. చిరునవ్వుతో ముందుకు సాగితే సమస్యలు తగ్గుతాయి. హనుమాన్ చాలీసా చదవడం శ్రేయస్కరం.

Eha Tv

Eha Tv

Next Story