తిరుమల లడ్డూ(Tirupati ladu) వివాదంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి(Kethi venkatreddy) స్పందించారు

తిరుమల లడ్డూ(Tirupati ladu) వివాదంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి(Kethi venkatreddy) స్పందించారు. జగన్‌పై(YS Jagan) నిరాధార ఆరోపణలు చేసిన చంద్రబాబు దమ్ముంటే దానిని రుజువు చేయాలని కేతిరెడ్డి అన్నారు. దీనిపై జగన్‌ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు చేసే ఆరోపణలకు జగన్ సరైన రీతిలో కౌంటర్లు ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కేతిరెడ్డి అభిప్రాయపడ్డారు. తిరుమల లడ్డూ వ్యవహారంతో పాటు, జమిలి ఎన్నికలపైనా(JAmili elections), పార్టీ మారడంపైనా కేతిరెడ్డి మాట్లాడారు. ఓ వీడియోను విడుదల చేసిన ఆయన చాలా విషయాలపైన మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే 'ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) వంద రోజుల పాలన సెలెబ్రెషన్స్‌లో భాగంగా ఆయన వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిపై(YS Jagan) కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై చంద్రబాబు కామెంట్లు చేయడం కొత్తేమీ కాదు. అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సరైన రీతిలో కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు జగన్‌. అధికారంలో ఉన్నప్పుడు అదే ఇబ్బంది పడ్డారు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పడు అదే ఇబ్బంది పడ్డారు. ఇప్పుడూ కూడా అదే ఇబ్బంది పడుతున్నారు. ఎందుకో చంద్రబాబుకు కౌంటర్‌ ఇవ్వడంలో వెనుకబడుతున్నామేమోనని అనిపిస్తోంది. జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో ఆరోపణలు చేశారు. లక్ష కోట్లు అన్నారు. ఇంకేదేదో చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసును జగన్‌ మీద నెట్టేశారు. సొంత బాబాయినే జగన్‌ చంపించారనే నిందలు వేశారు. సరైన సమయంలో ఆ ఆరోపణలకు ధీటుగా జవాబివ్వకపోవడంలో మన వైఫల్య కనిపిస్తోంది. ఇక తాజాగా చంద్రబాబు ఓ భయంకరమైన నిందను జగన్‌పై వేశారు. తిరుమల లడ్డూను తయారు చేయడంలో జంతువుల కొవ్వు నుంచి వచ్చే నూనెతో తయారు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఇది చాలా ప్రమాదకరమైన స్టేట్‌మెంట్‌. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడకూడదు. ఈ ఒక్క స్టేట్‌మెంట్‌తో చంద్రబాబు నిజం చెబుతున్నారా? అబద్ధం చెబుతున్నారా? ఇంతకు ముందు చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలా? అన్నది తేలిపోతుంది. జగన్‌ ప్రభుత్వంలో టీటీడీ ఛైర్మన్‌లుగా వ్యవహరించిన ఎస్‌.వి.సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డిలు ఇప్పటికే చంద్రబాబు ఆరోపణలను ఖండించారు. మనిషి జన్మ ఎత్తినవాడు ఎవరైనా ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తారా అని మండిపడ్డారు కూడా! దమ్ముంటే రుజువు చేయాలంటూ సవాల్‌ విసిరారు. ఈ విషయంలో జగన్‌ కూడా పెదవి విప్పాలి. జగన్‌ మాట్లాడి తీరాలి. ఇంతకు ముందు కూడా జగన్‌పై హిందు వ్యతిరేకి అన్న ముద్ర వేయడానికి చాలా నీచమైన ఆరోపణలు చేశారు. గుళ్లు కూలగొడుతున్నారని రచ్చ చేశారు. తర్వాత నిజమేమిటో తెలిసింది. అలాగే వైజాగ్‌ పోర్టుకు టన్నుల కొద్దీ డ్రగ్స్‌ వచ్చి చేరాయని ఆరోపించారు. ఇది కూడా సత్యదూరమే! ఇప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబే కదా! విచారణ జరిపించవచ్చు కదా! చంద్రబాబు బ్యాచ్‌ చేసే ఆరోపణలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చి ఉంటే మనకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు లడ్డూపై చంద్రబాబు నీచమైన ఆరోపణలు చేశారు. ఆ వేంకటేశ్వరస్వామి ఊరుకోడు. తప్పకుండా అసత్యాలు చెప్పిన వారికి తగిన శాస్తి చేస్తాడు. ఇంతటి దారుణమైన ఆరోపణలు చేసిన చంద్రబాబు దానిపై విచారణ జరిపించాలి. నిజాలు నిగ్గు తేల్చాలి. ఇక జమిలి ఎన్నికల విషయానికి వస్తే అది ఇప్పట్లో సాధ్యం కాదనే నేను అనుకుంటున్నాను. పార్లమెంట్‌లో సంపూర్ణ మెజారిటీ ఉంటే తప్ప బిల్లు పాస్‌ కాదు' అని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు.

Eha Tv

Eha Tv

Next Story