వైసీపీ హయాంలో(YCP) అదానీ గ్రూప్‌తో(Adani Group) ఏపీ డిస్కంలు విద్యుత్‌ కొనుగోళ్లకు(Electricity Purchase) సంబంధించిన ఒప్పందాలు చేసుకోలేదని వైసీపీ స్పష్టం చేసింది.

వైసీపీ హయాంలో(YCP) అదానీ గ్రూప్‌తో(Adani Group) ఏపీ డిస్కంలు విద్యుత్‌ కొనుగోళ్లకు(Electricity Purchase) సంబంధించిన ఒప్పందాలు చేసుకోలేదని వైసీపీ స్పష్టం చేసింది. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో(Solar energy corporation of india) మాత్రమే ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. దేశంలోని అధికారులకు అదానీ 2100 కోట్ల లంచాలు ఇచ్చారంటూ వస్తున్న ఆరోపణలతో విద్యుత్‌ కొనుగోళ్ల అంశాలు తెరమీదికి వచ్చాయి. అదేవిధంగా ఏపీలో కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో డిస్కంలు ఒప్పందాలు చేసుకున్నట్లు వస్తున్న వార్తలపై వైసీపీ ఒక ప్రకటన విడుదల చేసింది. 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను అత్యంత చౌకగా యూనిట్‌కు రూ.2.49 చొప్పున సెకీతో 2021 డిసెంబర్‌ 1న ఏపీ డిస్కమ్‌లు ఒప్పందం చేసుకున్నాయని లేఖలో తెలిపింది. రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ రూపంలో ఏటా సుమారు 12,500 మిలియన్‌ యూనిట్లను డిస్కమ్‌లు సరఫరా చేస్తాయని తెలిపింది. ఈ ఛార్జీలను డిస్కమ్‌లకు రాయితీ రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పింది. అంతేకాకుండా చంద్రబాబు(Chandrababu) అనాలోచిత నిర్ణయం కారణంగా యూనిట్‌ కాస్ట్‌ రూ.5.10కి చేరిందని ఇది డిస్కంలపై భారీగా భారం వేసిందని వైసీపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో యూనిట్‌ రూ.2.49 చొప్పున 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను 25 ఏళ్లపాటు సరఫరా చేసేలా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని వివరించింది. సెకీతో ఒప్పందం వల్ల అత్యంత చౌకగా విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని ఏటా రూ.3,700 కోట్ల మేర ఆదా అవుతుందని వైసీపీ ప్రకటించింది. 25 ఏళ్లపాటు ఈ ఒప్పందం అమల్లో ఉండటంతో రాష్ట్రంపై భారీగా భారం తగ్గనున్నట్లు వైసీపీ తెలిపింది.

Eha Tv

Eha Tv

Next Story