తాడేపల్లిలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత జెండాను ఆవిష్కరించి నిరాడంబరంగా వేడుకలు నిర్వహించారు.

తాడేపల్లిలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత జెండాను ఆవిష్కరించి నిరాడంబరంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అంటే వాయిస్‌ ఆఫ్‌ వాయిస్‌లెస్‌ అని వివరించారు. 15 ఏళ్ల ప్రయాణంలో తన వెంట నడిచిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్‌ ఆశయ సాధనే ధ్యేయంగా పార్టీని స్థాపించి నాటి నుంచి నేటి వరకు ఆయన ఆశయాల కోసం పార్టీని మోస్తున్న ప్రతీ కార్యకర్తకు, అభిమానికి, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలిపారు. తన ఒక్కడితో మొదలైన పార్టీ, ప్రజల ఆశీసుస్సలతో శక్తివంతమైన రాజకీయపార్టీగా ఎదిగిందని.. ఈ సుదీర్ఘ కాలంలో పార్టీ ప్రజలతోనే ఉందని.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేసిందన్నారు జగన్. తన పట్ల నమ్మకం ఉంచి నడుస్తున్న పార్టీ కార్యకర్తలు, నాయకులకు, అభిమానుంలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు జగన్

ehatv

ehatv

Next Story