YS Jagan : అరెస్టులపై జగన్ బిగ్ స్కెచ్..!
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోషల్ మీడియాలో(Social media) తమ కార్యకర్తలను అక్రమ కేసులు(Illegal cases) పెట్టి వేధిస్తున్నారని వైసీపీ నేతలు(YCP Leaders) ఆరోపిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోషల్ మీడియాలో(Social media) తమ కార్యకర్తలను అక్రమ కేసులు(Illegal cases) పెట్టి వేధిస్తున్నారని వైసీపీ నేతలు(YCP Leaders) ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని వాపోతున్నారు. రోజురోజుకు తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని.. మా హయాంలో ఇలాంటివి జరగలేదని గుర్తుచేస్తున్నారు. రాష్ట్రంలో మానవ హక్కుల(Human rights) ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులను మాజీ సీఎం జగన్ సీరియస్‌గా తీసుకున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని జాతీయ మానవహక్కుల కమిషన్‌కు(National human rights Commission) ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. జగన్(YS JAgan) ఆదేశాల మేరకు వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి(YV Subba reddy), పిల్లి సుభాష్ చంద్రబోస్(Pilli subash chandrabos), మేడా రఘునాథ్‌రెడ్డి(Meda raghunath reddy), గొల్లబాబురావు(Gollababu rao), తనూజారాణి(Thanuja rani) జాతీయ మానవ హక్కుల కమిషన్ యాక్టింగ్ చైర్పర్సన్ విజయభారతిని(Vijaya bharathi) కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఏపీలో కూటమి(TDP,Janasena) ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను టార్గెట్‌గా చేసుకొని అక్రమ కేసులను బనాయిస్తోందని ఆరోపించారు. ఏపీలో యథేచ్చగా రాజకీయకక్షలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం హరిస్తోందని వైసీపీ నేతలు విమర్శించారు. పెద్దిరెడ్డి సుధారాణి, ఆమె భర్త వెంకటరెడ్డిని నాలుగురోజుల పాటు అక్రమంగా నిర్బంధించారని తెలిపారు. ఏపీలో అరెస్టులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకోవాలని, రాష్ట్రంలో మానవ హక్కులను కాపాడాలని కోరారు. కేసులు పెడతారు, జైల్లో వేస్తారు.. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని.. న్యాయపరంగా అండగా ఉంటానని జగన్ కూడా గతంలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
- YCP leadersillegal casessocial media activistsAndhra Pradeshhuman rights violationsYS JaganNational Human Rights CommissionTDPJanasenawrongful arrestsVijayabharathiYV Subba ReddyPilli Subash ChandrabosMeda Raghunath ReddyGollababu RaoThanuja Ranipolice harassmentpolitical revengeYCP complaintshuman rights abuses