తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు అన్నాడు సుమతీ శతకకారుడు. మనం నిత్యం వాడే సామెతలో చెప్పాలంటే బెల్లం చుట్టూ ఈగలు!

తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు అన్నాడు సుమతీ శతకకారుడు. మనం నిత్యం వాడే సామెతలో చెప్పాలంటే బెల్లం చుట్టూ ఈగలు! ఇప్పుడు ఇవన్నీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ను చూస్తుంటే గుర్తుకొస్తున్నాయి. ఆయన ఎవరనుకోనేరు.. ఆళ్ల నానినే! రాజకీయాలంటేనే అవకాశవాదం అని తెలుసుకానీ మరీ ఇంతగానా? పార్టీలు మార్చే రాజకీయ ఉసరవెల్లిలను చాలా మందినే చూసి ఉంటాం కానీ ఆళ్ల నాని వారందరిని మించిపోయారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసినప్పుడు బోలెడన్ని కబుర్లు చెప్పారు. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నానన్నారు. ఓ రకంగా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టేనని చెప్పారు. ఇప్పుడా సన్యాసం వీడి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఆయన చంద్రబాబు పంచన చేరడమే చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఆళ్ల నానిగా సుపరిచితులైన కాళీకృష్ణ శ్రీనివాస్‌ ఏలూరు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కూడా పని చేశారు. అధికార వైభవాన్ని అనుభవించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఓడిపోగానే దుకాణం సర్దేసుకున్నారు. వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. పోన్లే పాపం అనుకున్నారంతా! ఇప్పుడు సడన్‌గా తెలుగుదేశంపార్టీలో చేరుతుండటంతో వైసీపీ నాయకులు బిత్తరపోయారు. ఆళ్ల నాని టీడీపీలో చేరడం వెనుక చంద్రబాబు ఉన్నారన్నది కాదనలేని సత్యం. ఆళ్ల నాని కోసం ఆయనకు సన్నిహితంగా ఉన్న విజయనగరం జిల్లాకు చెందిన ఓ నేతను ప్రయోగించి ప్రలోభపెట్టారన్నది టాక్‌! జగన్‌ పాలనలో జరిగిన విషయాలను ఆళ్ల నానితోనే చెప్పించాలన్నది చంద్రబాబు ప్లాన్‌! రెండు మూడు రోజుల తర్వాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి లాగే ఆళ్ల నాని కూడా జగన్‌పై విమర్శలు చేయడం గ్యారంటీ!

ehatv

ehatv

Next Story