తిరుమల లడ్డూపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది.

తిరుమల లడ్డూపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది. హిందూసాంప్రదాయాల గొప్పగా మాట్లాడిన చంద్రబాబు.. తన తల్లి, తండ్రి చనిపోయినప్పుడు తలనీలాలు ఎందుకు ఇయ్యలేదని ప్రశ్నించారు. ఇన్నిసార్లు తిరుమల వస్తారు కదా ఏరోజైనా తలనీలాలు శ్రీవారికి ఇచ్చారా అని అడిగారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Deputy CM pawan kalyan)ప్రాయశ్చిత్త దీక్ష ఎందుకు చేస్తున్నారని.. లడ్డూలో జంతువుల కొవ్వు(Animal Fat) కలిసిందని నిరూపిస్తే మేమే ప్రాయశ్చిత్త యాత్ర చేస్తామని అంబటి రాంబాబు(Ambati Rambabu) అన్నారు. సీబీఐ(CBI) విచారణ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని వైసీపీ(YCP)తరపున మేం డిమాండ్ చేస్తే సీఐడీ(CID)విచారణ చేయిస్తానని చెప్పడం ఏంటని అంబటి అన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా హిందుత్వాన్ని రెచ్చగొట్టాలని కుట్ర చేస్తున్నారని.. లడ్డూలో జంతు కొవ్వు కలిసినట్లు నిరూపిస్తే పవన్‌ కల్యాణ్ బూట్లు తాను తూడుస్తానని అంబటి అన్నారు. సరైన విచారణ చేపట్టాలని మేం అంటే శాంతి హోమాలు, ప్రాయశ్చిత్త దీక్ష అని డ్రామా మొదలుపెట్టారు. చంద్రబాబు(CM ChandraBabu) వ్యాఖ్యలపై సుబ్రమణ్యస్వామి(Subramanya Swamy) కూడా సుప్రీంకోర్టు(Suprem Court)లో పిటిషన్‌ వేశారు. ఆరోపణను నిరూపించలేక, సతమతమవుతున్నారన్నారు. న్యాయస్థానాలు జోక్యం చేసుకొని సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు బటయపడతాయన్నారు.

ehatv

ehatv

Next Story