ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్నకుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ విషయం అందరికీ తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్నకుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ విషయం అందరికీ తెలిసిందే. పవన్ కల్యాణ్‌(Pawan Kalyan) సతీమణి అన్నా లెజినోవా (Anna Lezhneva)తిరుమల శ్రీవారి దర్శనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సింగపూర్(Singapore) అగ్ని ప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) క్షేమంగా భయటపడడంతో భారత్ వచ్చిన వెంటనే ఆమె తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. అలాగే తలనీలాలు సైతం సమర్పించుకున్నారు. క్రిస్టియన్ అయినా అన్నా లెజినోవా ఆలయ నియమ నిబంధనలు పాటిస్తూ డిక్లరేషన్ ఇచ్చి హిందూ సంప్రదాయాలు, ఆచారాలను పాటిస్తూ శ్రీవారికి మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం నిత్యాన్నాదనం కోసం రూ.17 లక్షలు విరాళం ఇచ్చి భక్తులతో కలిసి నిత్యాన్నాదనంలో పాల్గొన్నారు. విదేశాల్లో పుట్టిపెరిగిన అన్నా లెజినోవా.. భారత్ కు వచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం క్రిస్టియన్ అయినప్పటికీ హిందూ ధర్మాన్ని అనుసరించడంపై ఆమెపై ప్రశంసలు వచ్చాయి. కొడుకు కోసం అన్నా లెజినోవా చేసిన మంచి పనిని చాలా మంది పొగిడారు. అయితే కొందరు ఆకతాయిలు మాత్రం అన్నా లెజినోవా తీరుపై నెట్టింట ట్రోల్స్ చేశారు.

ఈ ట్రోల్స్‌పై విజయశాంతి(Vijayashanti) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఎక్స్‌ ఖాతాలో అన్నా లెజినోవాపై ప్రశంసలు కురిపించారు. అలాగే ఆమెను ట్రోల్స్ చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిపై కూడా ట్రోల్స్ చేస్తారా అని అసహనం వ్యక్తం చేశారు.''దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్‌కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు. హరహర మహాదేవ్, జై తెలంగాణ” అంటూ ఎక్స్‌ ఖాతాలో రాసుకోచ్చారు విజయశాంతి.

ehatv

ehatv

Next Story