వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YCP) అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS jagan) ఇవాళ తిరుమలకు(Tirumala) వెళుతున్నారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YCP) అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS jagan) ఇవాళ తిరుమలకు(Tirumala) వెళుతున్నారు. శనివారం రోజున ఆయన స్వామివారిని దర్శించుకుంటారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌ తిరుమల పర్యటన రసాభాసా చేయడానికి అధికార పక్షానికి చెందిన కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జగన్ దర్శనానికి వెళ్లాలంటే తప్పనిసరిగా డిక్లరేషన్‌ ఫామ్‌పై(Declaration form) సంతకం చేయాలని కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ(BJP) డిమాండ్‌ చేస్తోంది. దీనికి జనసేన(Janasena), టీడీపీ(TDP) నాయకులు కూడా వంత పాడుతున్నారు. డిక్లరేషన్‌ అవసరం లేదని వైసీపీ నేతలే కాదు, తటస్థులు కూడా చెబుతున్నా, బీజేపీ నాయకులు వినిపించుకోవడం లేదు. ఇప్పటికే ప్రతిపక్ష నాయకుడిగా రెండుసార్లు, ముఖ్యమంత్రి హోదాలో అయిదుసార్లు శ్రీ వేంకటేశ్వరస్వామిని జగన్‌ దర్శించుకున్నారు. అప్పుడు లేని సంతకం ఇప్పుడెందుకన్నది వైసీపీ నాయకుల ప్రశ్న. దీనికి జవాబు చెప్పకుండా తిరుపతిలో జగన్‌ను అడ్డుకోవడానికి సంసిద్ధమవుతున్నారు కూటమి నేతలు. కేవ‌లం రాజ‌కీయ క‌క్ష‌తో మ‌త విద్వేషాల్ని కూట‌మి నేత‌లు రెచ్చ‌గొడుతున్నార‌ని సామాన్యులు కూడా అనుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. అలిపిరి దగ్గరే జ‌గ‌న్‌ను అడ్డుకుంటామ‌ని కూట‌మి నేత‌లు హెచ్చ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే ఉద్రిక్త ప‌రిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఉమ్మ‌డి చిత్తూరు, క‌డ‌ప‌, నెల్లూరు జిల్లాల్లోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయ‌కులకు గ‌త రాత్రి నుంచి పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. ఇల్లు దాటి బ‌య‌టికి రావ‌ద్ద‌ని పోలీసులు హెచ్చ‌రించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో పాల్గొని గొడ‌వల‌కు తెర‌లేపితే క‌ఠిన చ‌ర్య‌లుంటాయ‌ని పోలీసులు చెబుతున్నారు.

Eha Tv

Eha Tv

Next Story