తిరుమల శ్రీవారి లడ్డూ(Tirumala laddu) కల్తీ(Quality) జరిగిందన్న ప్రచారం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది.

తిరుమల శ్రీవారి లడ్డూ(Tirumala laddu) కల్తీ(Quality) జరిగిందన్న ప్రచారం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది. పవిత్రమైన లడ్డూ తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యిని వాడారని స్వయంగా సీఎం చంద్రబాబు(Chandrababu) చెప్పడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ హయాంలో టీటీడీకి(TTD) నెయ్యి(Ghee) సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ(AR Dairy) యాజమాన్యం స్పందించింది. తాము సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని వివరణ ఇచ్చింది. తమ డెయిరీ నుంచి జూన్, జూలైలో నెయ్యి సరఫరా చేశామని.. ఇప్పుడు టీటీడీకి నెయ్యి సరఫరాను ఆపామని ఏఆర్‌ డెయిరీ స్పష్టం చేసింది. 25 ఏళ్లుగా తాము డెయిరీ ఫీల్డ్‌లో ఉన్నామని దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నామని, మాపై ఏనాడు ఇలాంటి ఆరోపణలు రాలేదని చెప్పింది. తాజాగా తమ సంస్థపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో టీటీడీకి అందించే నెయ్యి నాణ్యత ప్రమాణాలపై టెస్టులు నిర్వహించామని పేర్కొంది. ఆ టెస్టుల్లో నెయ్యిలో ఎలాంటి లోపాలు లేవని తేలిందని చెప్పింది. కానీ తమపై విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ అడిగిన వెంటనే సంబంధిత రిపోర్టును పంపించామని తెలిపింది. కానీ టీటీడీ నుంచి తమకు స్పందన రాలేదని తెలిపింది.

Eha Tv

Eha Tv

Next Story