ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా ఆపేయండి: హైకోర్టు

ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా ఆపేయండి: హైకోర్టు

By :  ehatv
Update: 2024-12-12 10:26 GMT

తెలంగాణలో వాహనదారులు నిబంధనలు పాటిస్తారు. ఏపీలో మాత్రం పాటించట్లేదు అని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల డ్రైవర్లు తెలంగాణ సరిహద్దుకు వెళ్లగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారు. హైదరాబాద్‌లో అద్దాలకు నల్ల ఫిలిమ్స్ ఉన్న కారు ఒక్కటి కనిపించదు. అక్కడ చట్టనిబంధలు కఠినంగా అమలు చేస్తున్నారు. అదే ఆంధ్రలో కార్ల అద్దాలకు నల్ల ఫిలిమ్స్ ఉంటున్నాయి.. ఎవరూ సీటు బెల్టులు పెట్టుకోవడం లేదు. పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం. ఏపీలో హెల్మెట్ ధరించకపోవడం వల్ల మూడు నెలల్లో 667 మంది మృత్యువాత పడ్డారని.. నిబంధనలు సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.

Tags:    

Similar News