వరుస సమావేశాలతో పవన్ బిజీబిజీ

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌(Pawan kalyan) ఢిల్లీ(Delhi) పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్రమంత్రులు గజేంద్రసింగ్‌(Gajendra singh shekawath) షెకావత్‌, సీఆర్‌ పాటిల్‌, అశ్విని వైష్ణవ్(Ashwin vaishnav), నిర్మలా సీతారామన్‌తో(Nirmala sitharaman) సమావేశమయ్యారు. పర్యాటక రంగానికి(Tourism) చెందిన అంశాలను షెకావత్‌ దృష్టికి తీసుకెళ్లారు. టూరిజం ప్రాజెక్టులు, పర్యాటక వర్సిటీ లాంటి అనేక అంశాలపై మాట్లాడినట్లు తెలిపారు. వైజాగ్ రైల్వే జోన్ పేరును వాల్తేరు జోనుగా మార్చినందుకు రైల్వేమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురానికి మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్దఎత్తున వస్తుంటారని, పిఠాపురం మీదుగా వెళ్లే రైళ్లకు స్టాపింగ్ ఇవ్వాలని మంత్రిని కోరారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా తాను ఈ మేరకు హామీ ఇచ్చామన్నారు.

అయితే అధికారిక సమావేశాలపై ఎలాంటి చర్చ జరగడం లేదు కానీ.. కేంద్ర మంత్రులు, బీజేపీ(BJP) పెద్దలతో పవన్‌ వరుస భేటీలపై చర్చ మాత్రం జరుగుతోంది. పవన్‌ కల్యాణ్‌ ఎక్కడికి వెళ్లినా, ఎవరితో సమావేశాలు ఏర్పాటు చేసుకున్న జనసేనలో(Janasena) నెం.2 గా ఉన్న నాదెండ్ల మనోహర్‌ను(Nadendla manohar) తీసుకెళ్తుంటారు. కానీ పవన్ తన ఢిల్లీ పర్యటనలో నాదెండ్ల మనోహర్‌ను వెంట పెట్టుకుని వెళ్లలేదు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో పవన్ ప్రచారంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఏకపక్ష విజయం సాధించింది. ఈ ఫలితాల తరువాత బీజేపీ ముఖ్య నేతల సూచన మేరకు పవన్ హస్తిన బాట పట్టారని సమాచారం. సౌతిండియాలో పవన్‌ను సనాతన ధర్మకర్తగా బీజేపీ భావిస్తోందనే వార్తలు వెల్లువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్‌కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. మహారాష్ట్ర నూతన సీఎం ప్రమాణ స్వీకారానికి పవన్ హాజరు కానున్నారు. జమిలి ఎన్నికల దిశగా బీజేపీ కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఢిల్లీ, బీహార్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పవన్‌కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా సనాతన ధర్మమంటూ పవన్‌ చేస్తున్న వ్యాఖ్యలపై ఉత్తరాదిన చర్చ కొనసాగుతోంది. పవన్‌ స్టార్‌ను, సనాతన ధర్మాన్ని ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. సౌతిండియాలో పవన్‌కు మంచి ఫ్యాన్‌ బేస్‌ ఉంది.. ఆయన ఫ్యాన్ బేస్, సనాతన ధర్మం అంశాలను ఉపయోగించుకొని తమిళనాడులోకూడా పాగా వేయాలని బీజేపీ పన్నాగంలా కనిపిస్తోంది.

Eha Tv

Eha Tv

Next Story