తిరుమల లడ్డూ(Tirumala laddu) విషయంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌(Pawan kalyan) ఏదేదో చెబుతున్నారు.

తిరుమల లడ్డూ(Tirumala laddu) విషయంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌(Pawan kalyan) ఏదేదో చెబుతున్నారు. హిందూ ధర్మానికి జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) పెద్ద ద్రోహం చేశారని అంటున్నారు. జగన్‌ పాపం చేశాడని, అందుకు దేశంలోని ప్రతి హిందువూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భారమైన డైలాగులు చెబుతున్నారు. అంతేనా 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష కూడా మొదలుపెట్టారు. పనిలో పనిగా లేనిపోని ఆరోపణలన్నీ చేస్తున్నారు. ఆఖరికి శ్రీవాణి(srivani trust) పథకం కూడా దేవుడికి జగన్మోహన్‌రెడ్డి చేసిన ద్రోహమని పవన్‌ కల్యాణ్‌ అంటున్నారు. తెలిసి అన్నారో తెలియక అన్నారో తెలియదు కానీ శ్రీవాణి ట్రస్టు పేరుతో పది వేల రూపాయలు వసూలు చేసి బిల్లు మాత్రం 500 రూపాయలకే ఇస్తున్నారంటూ పవన్‌ అన్నారు. కనీస అవగాహన లేకుండా ఈ మాట చెప్పారని ఇట్టే అర్థమవుతోంది. అసలు శ్రీవాణి పథకం కింద దర్శనమే ప్రత్యేకమైనది. శ్రీవాణి ట్రస్టుకు విరాళంగా పది వేల రూపాయలు చెల్లించిన వారికి 500 రూపాయల విలువ కలిగిన వీఐపీ టికెట్‌ను ఇస్తారు. అంతే కానీ ఇచ్చిన పది వేల రూపాయలకు బిల్లు కానీ రిసీట్‌ కానీ ఇవ్వరని కాదు. డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ ఇలాంటి నిరాధారణ ఆరోపణలు చేయడమేమిటన్నది చాలా మందికి వస్తున్న అనుమానం. చిత్రమేమిటంటే శ్రీవాణి దర్శనాల పథకాన్ని కూటమి(TDP alliance) ప్రభుత్వం కూడా కొనసాగించడం. నిజంగానే పవన్‌ కల్యాణ్‌ చెప్పినట్టుగా శ్రీవాణి ట్రస్టు రూపేణా చేయిస్తున్న వీఐపీ దర్శనాలు తప్పు అయితే కూటమి ప్రభుత్వంలో పవన్‌ కీలక హోదాలో ఉన్నారు కదా. దాన్ని ఆపించేయవచ్చు కదా! ఆ పని మాత్రం చేయరు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో టికెట్ల అమ్మకాలతో డబ్బు సంపాదిస్తున్నది కాబట్టి...!

Eha Tv

Eha Tv

Next Story