ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌కు(Pawan kalyan) మెమరీ లాస్‌(Memory loss) అయ్యిందంటున్నారు జైభీమ్‌రావ్‌ పార్టీ(Jai bhim rao Party) అధినేత జడ శ్రవణ్‌(Jada sravan).

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌కు(Pawan kalyan) మెమరీ లాస్‌(Memory loss) అయ్యిందంటున్నారు జైభీమ్‌రావ్‌ పార్టీ(Jai bhim rao Party) అధినేత జడ శ్రవణ్‌(Jada sravan). మహిళల మిస్సింగ్‌ కేసులపై(Women missing case) పవన్‌ మాటలు విన్నవారికెవరికైనా ఆయన మానసికస్థితిపై అనుమానాలు కలుగుతాయని అన్నారు. లేటెస్ట్‌గా పవన్‌ చేసిన ట్వీట్‌ను చూస్తే ఆయన పరిణతి లేని నాయకుడని అర్థమవుతుందని అన్నారు జడ శ్రవణ్‌. మొన్నేమో ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు అదుపుతప్పాయని, హోమ్‌మంత్రి అనిత(Vangalapudi anitha) ఏం చేస్తున్నట్టు అని, తాను హోంమంత్రిత్వ శాఖను తీసుకుంటే మామూలుగా ఉండదని పవన్‌ రెచ్చిపోయి మాట్లాడరని, ఇప్పుడు చేసిన ట్వీట్‌లోనేమో అనితను తెగ పొడుగుతున్నారని జడ శ్రవణ్‌ వివరించారు. అంటే పవన్‌ పొగిడినప్పుడు పొగిడించుకోవాలి...తిట్టినప్పుడు తిట్టించుకోవాలా? అని శ్రవణ్‌ ప్రశ్నించారు. గజని సినిమాలో హీరో సూర్యకు ఉన్నట్టుగా పవన్‌కు లాంగ్‌టర్మ్‌ మెమరీ లాస్‌ ఉన్నట్టుగా అనిపిస్తున్నదని జడ శ్రవణ్‌ అన్నారు.



Updated On 21 Nov 2024 6:40 AM GMT
Eha Tv

Eha Tv

Next Story