VisakhapatnamCrime:భార్యకు మత్తు మందు ఇచ్చి..!
విశాఖలో దారుణం చోటు చేసుకుంది. భార్యకు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి, ఆపై నిప్పంటించి దారుణానికి ఒడగట్టాడు ఓ భర్త.
విశాఖలో దారుణం చోటు చేసుకుంది. భార్యకు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి, ఆపై నిప్పంటించి దారుణానికి ఒడగట్టాడు ఓ భర్త. మత్తులోకి జారుకున్న తర్వాత ఒంటిపై భర్త నిప్పు అంటించాడు. మంటలు అంటుకున్న కొద్దిసేపటికి బాధితురాలి అరుపులు విని వెంటనే స్థానికులు రక్షించి ఆస్పత్రికి తరలించారు. గ్యాస్‌స్టవ్‌తో ప్రమాదం జరిగిందని చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. చికిత్స పొందుతూ ఆమె కోలుకోవడంతో అసలు బండారం బయటపడింది. విశాఖలోని(Visakhapatnam) మురళీనగర్ సింగరాయ కొండపై నివసిస్తున్న వెంకటరమణ(Venkataramana), కృష్ణవేణిలకు(Krishnaveni) ఐదేళ్ల క్రితం పెళ్లయింది. ఈ జంటకు కుమారుడు, కూతురు ఉన్నారు. వెంకటరమణకు మద్యం వ్యసనంతో పాటు భారీగా అప్పులున్నాయి. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్యను హత్య చేయాలని భావించిన వెంకటరమణ.. గత నెల 16న రాత్రి మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ తెచ్చి భార్యకు ఇచ్చాడు. అనంతరం నిప్పంటించాడు. మత్తునుంచి బయటపడిన బాధితురాలు కృష్ణవేణి కేకలు వేయడంతో స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమె కోలుకుని విషయం చెప్పడంతో భర్త నిర్వాకం బయటపడింది. దీంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.