ఓ బాలిక కిడ్నాప్‌, హత్యకు గురైతే పోలీసులు పట్టించుకోలేదని మాజీ మంత్రి ఆర్కే రోజా(RK Roja) విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu) సొంత జిల్లా చిత్తూరులో ఓ బాలిక కిడ్నాప్‌, హత్యకు గురైతే పోలీసులు పట్టించుకోలేదని మాజీ మంత్రి ఆర్కే రోజా(RK Roja) విమర్శించారు. చిన్నారి హత్య ఘటన విని గుండె తరుక్కపోయిందని, నిందితులను వెంటనే అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని రోజా డిమాండ్‌ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న పిల్లల్ని స్కూళ్లకు పంపించాలంటేనే ఆడపిల్లలు తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఉందన్నారు రోజా. బాలిక 29వ తేది కిడ్నాప్ అయితే నాలుగు రోజుల పాటు నాలుగు కిలోమీటర్ల దూరంలో పుంగనూరులో ఉన్నా పోలీసులు పట్టుకోలేకపోయారని, చంద్రబాబు, హోం మంత్రి,డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. 'ప్రజల్ని పట్టించుకోరు.మహిళల్ని పట్టించుకోరు. చిన్నారులను పట్టించుకోరు.అసలు ఈ ప్రభుత్వం ఉందా? పోలీసులు ఉన్నారా? ఉంటే ఏం చేస్తున్నారు? అని నిలదీశారు రోజా. ఈ రాష్ట్రంలో పోలీసులను కేవలం కక్ష సాధింపు చర్యలకు,రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు మాత్రమే వినియోగిస్తున్నారని విమర్శించారు. .రాష్ట్రంలో మహిళలు,పిల్లల్ని పట్టించుకోరా అంటూ రోజా ప్రశ్నించారు.

Eha Tv

Eha Tv

Next Story