కల్తీ నెయ్యితో(Ghee) తిరుమల లడ్డూ(Tirumala laddu) ప్రసాదాన్ని తయారు చేశారని వచ్చిన వార్తల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు.

కల్తీ నెయ్యితో(Ghee) తిరుమల లడ్డూ(Tirumala laddu) ప్రసాదాన్ని తయారు చేశారని వచ్చిన వార్తల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. విజయవాడ(Vijayawada) కనకదుర్గ(Kanaka durga) ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దుర్గమ్మ సన్నిధిలో ఉన్న మెట్లను శుభ్రం చేశారు. మెట్లకు పసుపురాసి కుంకుమ బొట్లు పెట్టారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులపై విరుచుకుపడ్డారు. కొన్ని నిమిషాల పాటు ఆవేశంగా మాట్లాడారు. తప్పు జరిగిదంటే ప్రాయశ్చిత్తం చేసుకోండి. లేదంటే మౌనంగా ఉండండి అంటూ వైసీపీ నాయకులకు హెచ్చరికతో కూడిన హితవు చెప్పారు. సనాతన ధర్మంపై పోరాటం చేయగలిగితే తననెవరూ ఆపలేరన్నారు. ఈ నేల అన్ని మతాలను గౌరవిస్తుందని, ధర్మానికి విఘాతం కలిగినప్పుడు అందరూ మాట్లాడాలని అన్నారు. తప్పు చేసిన వాళ్ల నాశనం మొదలైందని శాపం పెట్టారు. ‘ఈ దేశంలోని సగటు హిందువుకు వేరే మతం, వ్యక్తి మీద ద్వేషం ఉండదు. సనాతన ధర్మం పాటించే వ్యక్తులు ఇతర మతాలను గౌరవిస్తారు. వైసీపీ పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాస్యం చేశారు. హైందవ ధర్మాన్ని కాపాడతామని సుబ్బారెడ్డి(YV subba reddy), కరుణాకర్‌రెడ్డి(Karunakar reddy) బాధ్యత తీసుకున్నారు. అపవిత్రం జరిగిందంటే బాధ్యత ఉన్న వ్యక్తులు సమాధానం చెప్పాలి. నాపై విమర్శలు కాదు.. అపవిత్రం జరిగిందని తెలిసినప్పుడు మీ బాధ్యతేంటి? విచారణకు రావాలంటే వై.వి.సుబ్బారెడ్డి రికార్డ్స్‌ కావాలి అంటున్నాడు. మీరు మాకు ఇచ్చారా? సుబ్బారెడ్డి విచారణకు రెడీగా ఉండు. ధర్మారెడ్డి(EO dharma reddy) ఇష్టానుసారంగా ఎలా వ్యవహరించాడో నేను దర్శనానికి వెళ్ళినప్పుడు చూశా. ధర్మారెడ్డి అడ్రెస్సు లేడు.. ఇంత జరుగుతుంటే ఏమయ్యాడు? కొడుకు చనిపోతే నిబంధనలకు విరుద్ధంగా తిరుమల కు వెళ్ళాడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నేను బ్లేమ్ చెయ్యడం లేదు.. తప్పు జరిగితే ఒప్పుకోవాలి కదా. తిరుమలతో ఆటలు ఆడతామా.. అన్ని ఆధారాలు ఉన్నాయి' అని పవన్ కల్యాణ్‌ అన్నారు. లడ్డూ ప్రసాదంలో అపవిత్రం జరిగిందంటే చాలా ఆవేదన కలుగుతోందని, సాటి హిందువులు.. తోటి హిందువులను దూషించడం మంచి పద్ధతి కాదని పవన్‌ చెప్పారు. బాధ్యత తీసుకున్న వాళ్లనే తాను నిందిస్తున్నానని, ఇప్పటికీ వైసీపీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని పవన్‌ కల్యాణ్‌ చెప్పుకొచ్చారు.

Eha Tv

Eha Tv

Next Story