Viral Video : వివాదంలో మాజీ మంత్రి రోజా

మాజీ మంత్రి రోజా సెల్వమణి తమిళనాడులోని తిరుచెందూర్ మురుగన్ ఆలయ ద‌ర్శ‌నానికి వెళ్లింది.

By :  Eha Tv
Update: 2024-07-17 08:31 GMT

మాజీ మంత్రి రోజా సెల్వమణి తమిళనాడులోని తిరుచెందూర్ మురుగన్ ఆలయ ద‌ర్శ‌నానికి వెళ్లింది. అయితే అక్క‌డ ఆమెతో సెల్ఫీ కోసం క్లీనింగ్ సిబ్బంది ఆమె వద్దకు రాగా.. దూరంగా ఉండ‌మ‌ని సైగ చేసిన వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు రావ‌డంతో వివాదం రేగింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది.

వైరల్ వీడియోలో.. రోజా ఆలయం నుండి బయటకు వచ్చేటప్పుడు క్లీనింగ్ సిబ్బంది సెల్ఫీలు తీసుకోవడానికి వారి మొబైల్ ఫోన్‌లతో ఆమె వద్దకు రావడం చూడవచ్చు. ఇద్దరు మహిళా క్లీనింగ్ సిబ్బంది రోజాతో ఫోటో తీసుకోవ‌డానికి ప్రయత్నించగా.. వారిని దూరం ఉండ‌మని సూచించడం వీడియోలో కనిపిస్తుంది.

దీనిపై కులవివక్ష అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక నెటిజ‌న్ స్పందిస్తూ.. ఢిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ వంటి నాయకులు 'నేను మీ రెల్లి కులస్థుడిని' అంటూ పారిశుధ్య కార్మికులతో గ్యాప్‌ని తగ్గించడానికి ప్రయత్నిస్తుండగా.. YCP నాయకులు ఇప్పటికీ కుల వివక్షను కొనసాగిస్తున్నారని కామెంట్ చేశారు.

ఎస్సీ/ఎస్టీ సంఘాలు ఈ విషయాన్ని గ్రహించి వైసీపీకి మద్దతివ్వడంపై పునరాలోచించాలి’’ అని మరో నెటిజ‌న్ రాశాడు. ‘‘రోజా సెల్వమణి దేవుడిని కాపాడమని ప్రార్థిస్తుంది.. రోజా సెల్వమణి ఇలా ఫొటోలు దిగడం సరికాదు.. ఉద్యోగుల సమయాన్ని వృథా చేయ‌డ‌మే’’ అని మరొకరు విమర్శించారు.

Tags:    

Similar News