ConspiracyAllegations:వర్రా రవీందర్‌రెడ్డికి వైసీపీ నుంచి ప్రాణహాని..!
వర్రా రవీందర్‌రెడ్డికి వైసీపీ నుంచి ప్రాణహాని ఉందని టీడీపీ నేత బీటెక్ సంచలన ఆరోపణలు చేశారు.
వర్రా రవీందర్‌రెడ్డికి వైసీపీ నుంచి ప్రాణహాని ఉందని టీడీపీ నేత బీటెక్ సంచలన ఆరోపణలు చేశారు. వర్రా రవీందర్‌రెడ్డిని అరెస్ట్ చేశారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) నేతలే సోషల్ మీడియాలో బయట చెప్పుకున్నారు. ఇదే వైసీపీ వర్రా రవీందర్‌రెడ్డి (VarraRavinderReddy)తప్పించుకున్నారని చెప్తున్నారు. వర్రా రవీందర్‌రెడ్డి గురించి సమాచారం ఎప్పటికప్పుడు వైసీపీ నేతలకే తెలుస్తోందన్నారు. ఇదంతా చూస్తుంటే దీని వెనుక భారీ కుట్ర కోణం దాగి ఉందని అనుమానం కలుగుతోందని.. వర్రా రవీందర్‌రెడ్డి ప్రాణానికి హాని చేసి ఆ నెపం టీడీపీ(TDP) మీద, కూటమి ప్రభుత్వంపై వేయాలని కుట్రకు దిగారని అనుమానం తమకు ఉందని బీటెక్ రవి అన్నారు. తమ పార్టీకి రాజకీయ ప్రయోజనం జరిగితే తమ సొంత మనుషులను ఏం చేయడానికైనా సిద్ధపడుతారు. ఆ నెపాన్ని పోలీసులు, ప్రభుత్వంపై నెట్టేందుకు కుట్ర జరుగుతోంది. వర్రా రవీందర్‌రెడ్డి విషయంలో వివేకా పీఏ రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయాలు బయటపడుతాయి. వైసీపీనే వర్రా రవీందర్‌రెడ్డిని ఏదైనా చేసి అది పోలీసులపైకి నెట్టేందుకు కుట్ర జరుగుతోందని.. అందుకే పోలీసులు వెంటనే వర్రా రవీందర్‌రెడ్డిని పట్టుకోవాలని బీటెక్ రవి కోరారు.