CM Chandrababu : సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేం.. పరోక్షగా బాబు సంకేతాలు..!
ఎన్నికల ప్రచారం సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చింది.

ఎన్నికల ప్రచారం సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చింది. అవి రైతులకు ఉచిత విద్యుత్ 24 గంటల నిరంతర సాగు కరెంట్, బ్యాంకు రుణాల మాఫీ, రైతులు, మహిళా సంఘాలకు రుణ మాఫీ, ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ భృతి, కొత్త ఉద్యోగాల భర్తీ, ఆరోగ్య సేవలు, ఉచిత వైద్యం, మెరుగైన వైద్య సేవలు, నూతన పింఛన్లు, వృద్ధులు, వికలాంగులకు పెరిగిన మొత్తంతో పింఛన్, నిరుపేదలకు ఇంటి స్థలాలు, గృహ నిర్మాణ ప్రణాళికలు. ప్రజలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలను అమలు చేస్తారని భావించారు. కానీ, ప్రస్తుతానికి వీటిపై ఎటువంటి స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో నిరాశ, అసంతృప్తి పెరుగుతోంది.
అయితే టీడీపీ ఆవిర్భావ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు సూపర్ సిక్స్ హామీలిచ్చాం. ఆరోజు బయట నుండి చూస్తే అన్నీ చేయగలుగుతాం అనిపించింది. నేను అనేకసార్లు చెప్పా. అభివృద్ధి జరగాలి.. సంపద సృష్టించాలి. ఆదాయం పెంచి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. అప్పులు చేసి సంక్షేమపథకాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయి. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో కూరుకుపోయాం అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.అంతేకాకుండా రాష్ట్రానికి రూ. 9.75 లక్షల కోట్లు అప్పుందంటూ వ్యాఖ్యానించారు. ఆ అప్పులకు వడ్డీ కట్టాలి. అసలు కట్టాలి. అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో సూపర్ సిక్స్ అమలు చేయలేమని చెప్పినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
