ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతున్న ముంబై నటి జత్వానీ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని విచారిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతున్న ముంబై నటి జత్వానీ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని విచారిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు మరో ఇద్దరు కింది స్థాయి పోలీసు అధికారుల్ని కూడా సస్పెండ్ చేసింది. అయితే జత్వానీపై గతంలో వైసీపీ(YCP) నేత కుక్కల విద్యాసాగర్ (Kukkala Vidya sagar)పెట్టిన కేసు మాత్రం వెనక్కి తీసుకోలేదు. దీంతో ఆ కేసే ఇప్పడుు కీలకంగా మారిపోయింది. అయితే ఈరోజు సచివాలయానికి తన లాయర్లతో కలిసి వచ్చి హోంమంత్రి అనిత(Home Minister Anitha)ను జత్వానీ కలిశారు. అప్పట్లో వైసీపీ పెద్దల ఆదేశాలతో ఐపీఎస్ (IPS)లు తనను ఎలా వేధించారో వివరించారు. తనకు ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరారు. అలాగే అప్పట్లో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పీఎస్ లో తనపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని కోరారు. అయితే తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకుంటేనే ముంబైలో పారిశ్రామిక వేత్తపై కేసు పెడతానని ట్విస్ట్ ఇచ్చారు. తన కేసును మ్యానిపులేట్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు జత్వానీ. తన కేసును రాజకీయం చేయొద్దని ఆమె కోరారు. జిందాల్‌ కుటుంబసభ్యుల పాత్ర ఉందా అంటే నో కామెంట్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇప్పటికే హనీ ట్రాప్‌కు పాల్పడిందని జత్వానీపై వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అయితే జత్వానీపై కేసు ఉపసంహరించుకుంటారాల లేదా అన్నది చూడాలి.

ehatv

ehatv

Next Story