ఈ విషయం నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పా.

జగన్(YS Jagan) గారు మొన్న ఒక వీడియో ప్లే చేశారు కదా జగన్ కి నిజంగా చెల్లెలి మీద ప్రేమ ఉండి ఉంటే బాలకృష్ణ లేదా ఆయన బిలింగ్ నుంచి తప్పుడు ప్రచారం జరిగింది అని తెలిసి ఉంటే మీరు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా అన్నార కదా.. అప్పుడు గాడిదలు కాశారా అని ప్రశ్నించారు. ఎందుకు బాలకృష్ణ(Balakrishna) మీద విచారణ జరిపించలేదని.. చెల్లెలి మీద ప్రేమ ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. నాకు అక్రమ సంబంధాలు అంట కట్టిన వాళ్లు ఎవరో కూడా నాకు ఇప్పటికీ తెలియదు, నేను కేసు పెట్టిన రోజే ఈ విషయం చెప్పా.. నాకు ప్రభాస్‌(Prabhas) ఎవరో తెలియదు.. నేను ఇప్పటి వరకు అతన్ని చూడలేదన్నారు. ఈ విషయం నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పా. గత 5 ఏళ్లుగా మీ సోషల్ మీడియా సైతాన్‌ సైన్యంతో నాపై తప్పుడు ప్రచారం చేయించలేదా అని ప్రశ్నించారు. మీకు అవసరం అనుకుంటే అందరినీ వాడుతారు. చివరికి నా వీడియో కూడా వాడుతారని..అమ్మను కేసు పెడతారు, నాన్న పేరు సీబీఐ ఛార్జ్ షీట్ లో పెట్టిస్తారని.. మీకు మీరే సాటి జగన్ సార్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Eha Tv

Eha Tv

Next Story