ఆంధ్రప్రదేశ్‌లో 59 మందికి నామినేటెడ్‌ పోస్టులు పంచేశారు

ఆంధ్రప్రదేశ్‌లో 59 మందికి నామినేటెడ్‌ పోస్టులు పంచేశారు. స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్.. క్యాబినెట్ ర్యాంక్ హోదాతో చాగంటి కోటేశ్వర్ రావుకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సలహాదారుగా నియమించారు. కాపు కార్పొరేషన్‌కు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడిని నియమించారు. స్వచ్ఛ్‌ ఆంధ్రప్రదేశ్‌కు పట్టాభిరాంను నియమించారు. టీడీపీ కోసం కష్టపడి పనిచేసినవారికి పదవులు కట్టబెట్టారు. టీడీపీకి చెందిన 49 మందిని, జనసేనకు చెందిన 9 మందిని, బీజేపీకి చెందిన ఒకరికి పదవులు కట్టబెట్టారు. ముఖ్యమైన కార్పొరేషన్లతో పాటు పలు అప్రాధాన్యత కార్పొరేషన్లకు కూడా చైర్మన్లను ప్రకటించారు. అప్రాధాన్యత కార్పొరేషన్ల అంటూ ఏమీ ఉండవు కానీ.. ఆ కార్పొరేషన్లకు నిధులు కేటాయించడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఆ పోస్టులకు న్యాయం చేకూరుతుంది. గత ప్రభుత్వంలో కార్పొరేషన్లకు నిధులు లేవని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ అయితే పూర్తయింది. కానీ కార్పొరేషన్లకు నిధులు, విధులు, వసతులు కల్పించాలని సంబంధిత కార్పొరేషన్ల వర్గాలు కోరుతున్నాయి.

ehatv

ehatv

Next Story